శ్రీకాకుళం

సంక్షేమ చట్టం బలహీనపరిచే చర్యలు విడనాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 25: నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం బలహీనపరిచే చర్యలు విడనాడాలని పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సామూహికంగా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.లక్ష్మణరావు, ఎం. ఆదినారాయణమూర్తిలు మాట్లాడుతూ కార్మికులకు చంద్రన్న భీమా అవసరం లేదని పుష్కలంగా ఉన్న సంక్షేమ చట్టం నిధులతో వారికి మెరుగైన పథకాలు అమలు చేయవచ్చునన్నారు. ఇతర రంగాల్లో ఉన్న కార్మికులకు చంద్రన్న బీమా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేయాలన్నారు. ఇందుకోసం నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని వినియోగించడం చట్టవిరుద్దమన్నారు. యూనియన్ జిల్లా గౌరవధ్యక్షులు ఎం.హరనాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ కార్మికులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని లేనిచో రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. నిర్మాణ కార్మికుల పిల్లల చదువుకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్మాణ రంగంపై జి ఎస్ టి పేరుతో వేసిన భారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో కుప్పిలి చిన్నారావు, కె.అసిరప్పడు, బి.లక్ష్మణరావు, ఎం.త్రినాధ, ఎం.అప్పలనాయుడు, బి.వాసుదేవరావు, ఎస్.అప్పారావు, టి.హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయంలో ఉద్యానవన పంటలు కీలకం
సారవకోట, సెప్టెంబర్ 25: గడచిన కొన్ని సంవత్సరాలుగా కేవలం వరి పంటకు మాత్రమే వ్యవసాయాన్ని పరిమితం చేయడం వలన ఉత్పత్తులు గణనీయంగా తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుండి రైతును గట్టెక్కించడానికి లాభదాయకమైన ఉద్యానవన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దీని కోసం ఒక్కొ రైతుకు భారీ ఎత్తున సబ్సీడి పైకం అందజేస్తుందని వివరించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉద్యానవన శాఖ తరఫున ఎంపిక చేసిన రైతులకు 4వేలు ఖరీదుగల పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ 20 ఏళ్లలోపు వయస్సు గల జీడితోటలను అభివృద్ధి చేయడానికి ఒక్కొ రైతుకు మూడు రంపాలు , రెండు కత్తెర్లు, రెండు పొడవైన కత్తులు వంటి పరికరాలు ఉచితంగా అందజేశారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందజేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత గిరిజన రైతులతో పాటు ఇతర రైతులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖాధికారి మురళీధర్, అసిస్టెంట్ మిత్ర, లక్ష్మీ, ఎంపిడివో జగదీశ్వరరావు, తహశీల్దార్ ఈశ్వరమ్మ పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

టిడిపితోనే అభివృద్ధి సాధ్యం
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 25: టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి మండలంలోని కనుగులవానిపేట గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఎగురవేసి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని వాటిని ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు స్పష్టంచేశారు. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ వాటిని అమలు చేస్తున్నారన్నారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించారన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని చంద్రబాబుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొండు జగన్నాధరావు, సర్పంచ్ కనుగుల కృష్ణారావు, ఎంపిటీసీ అశ్వినీ , వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మూకళ్ల శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షులు ఇప్పిలి శివ, గేదెల శ్యామ్, సూరాడ అప్పన్న, కంచు దశరధ, ఇప్పిలి రమణ తదితరులు పాల్గొన్నారు.