శ్రీకాకుళం

వంశ ధార’ రాజన్న చలవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: సిక్కోల్ జీవదార..వంశధారే..వంశధార నీటితో తడిసే ప్రతీ ఎకరా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చలవేనని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నాలుగు దశాబ్ధాలుగా వివాదాల్లో చిక్కుకున్న వంశధార ప్రాజెక్టుపై ఇటీవల వంశధార ట్రిబ్యూనల్ తుది తీర్పును వెల్లడించడాన్ని వైకాపా స్వాగతించిందన్నారు. సోమవారం వంశధార పనులను పరిశీలించిన ధర్మాన అనంతరం కాట్రగడలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ట్రిబ్యూనల్ తీర్పుతో వంశధార వివాదానికి శాస్వత పరిష్కారం లభించింనట్టు అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో నడుంబగించి, జిల్లాకు జీవధారైన వంశధార ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులెత్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. గంతంలో వంశధార వివాదం కొనాగసతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దృష్టికి జిల్లా ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని తీసుకవెళ్ళిన సందర్భంలో ఆయన చూపించిన చొరవను ధర్మాన గుర్తుచేసారు. జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టు నిర్మాణాన్ని, డిజైన్లు మార్చిన ఘనత రాజన్నకే దక్కుతుందన్నారు. వంశధార ప్రాజెక్టు పురోగతి ప్రశ్నార్థకమైన ఆ సమయంలో రూపశిల్పి సి.ఆర్.ఎం. పట్నాయిక్ తనకు ప్రత్యామ్నాయాన్ని సూచించారని దాని ఆసరాతో వంశధారను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఏర్పడిందని ధర్మాన చెప్పారు. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం..అనంతరం ట్రిబ్యూనల్ ఏర్పాటు కావటం జరిగిన విషయాన్ని ఈ వేదిక నుంచి ధర్మాన గుర్తుచేసారు. వైఎస్సార్ నిర్ణయమే నేటి ట్రిబ్యూనల్ తీర్పునకు దారితీసిందన్న నిజాన్ని జిల్లా ప్రజలు, రైతాంగం, రాజకీయ పక్షాలు గుర్తించాలని ధర్మాన కోరారు. నేరడి ప్రాజెక్టుకి అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపించి, ఒడిషా ప్రభుత్వంతో చర్చను జరపాలని ధర్మాన కోరారు. దీంతోపాటు నేరడి ప్రాజెక్టుకు సంబణధించిన అన్ని అనుమతులు సాధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వంశధార ప్రాజెక్టుకి సంబణధించి ఎడమ, కుడి ప్రధాన కాలువ లైనిగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణంతోనే జిల్లా రైతాంగానికి శాశ్వతంగా సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణమైతే, జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వైఎస్సార్ దూరదృష్టితో నాడు సైడు వియర్ నిర్మాణానికి కృషి చేయకపోయివుంటే ఇప్పటికీ, వంశధార ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయే పరిస్థితి అన్నారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి వైకాపా హైపవర్ కమిటీ సభఉయడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ జిల్లాకు ఎంతో చేసామంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు ఒరగబెట్టినది ఏబీలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాపై కేవలం సవతితల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వంశధారకు ముక్తి, మోక్షం రావని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే వంశధార పనులకు ఉరుకు పరుగు ప్రారంభమవడం ఖఆయమన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, నర్తు రామారావు, సిదిరి అప్పలరాజు, ఎచ్చెర్ల సూర్యనారాయణ, అంధవరపు సూరిబాబు, పాలవలస విక్రాంత్, ఎం.వి. పద్మావతి, చల్లా రవికుమార్, మామిడి శ్రీకాంత్, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్.ప్రసాద్, కోణార్క్ శ్రీను, మెంటాడ స్వరూప్, మండవల్లి రవి, కాపవరపు సీజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బహిరంగ సభకు ముందు వైకాపా నేతలు ప్రస్తుతం కాట్రగడ వద్ద జరుగతున్న వంశధార సైడ్‌వీయర్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. నేరడి సాధన కోసం రైతు సాగునీటి కోసం పరిష్కారం జరిగేంతవరకూ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైకాపా ఉద్యమాలకు నడుంబిగిస్తుందని చేసిన తీర్మాన్ని వైకాపా నేతలు, కార్యకర్తలు బలపరుస్తూ, ఆమోదించారు.
చంద్రబాబు పాలనలోనే గ్రామాలాభివృద్ధి
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 25: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలోనే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించాయని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. జరజాం గ్రామంలో సోమవారం ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో లోటుబడ్జెట్ వంటి సమస్యలు అధిగమించి ఎన్నికల హామీల్లో అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్య, వైద్యం గ్రామాల్లో వౌలిక వసతులు కల్పనకు నిధులు కేటాయించడం వలన పౌరులు పురోగతి సాధించేందుకు బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించి 80శాతం మంది ఓటర్లు చంద్రబాబునాయకత్వానికి అండగా నిలిచేలా పనిచేయాలన్నారు. ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈకార్యక్రమం దోహడపడుతుందన్నారు. మండల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, కార్యదర్శి వి.రామకృష్ణ, పంచిరెడ్డి సత్యన్నారాయణ, బొడ్డేపల్లి ప్రసాద్, తంగి మల్లేశ్వరరావు, అనె్నపు భువనేశ్వరరావు, మెండ రాజారావు తదితరులు ఉన్నారు. జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని తొలుత ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
నేరాలు తగ్గుముఖం: ఎస్పీ
పలాస, సెప్టెంబర్ 25: కమ్యూనిటీ పోలీసు వ్యవస్థతో జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సి ఎం త్రివిక్రమవర్మ అన్నారు. కాశీబుగ్గ పోలీసులు ఇటీవలకాలంలో నిందితులు నుంచి నాలుగు ద్విచక్రవాహనాలు, ఒక ఇనోవా కారు, 20 లక్షల రూపాయలు విలువ చేసే 182 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపివో ఎస్‌తో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, వారి వద్ద ఆధారాలు ఉంటే విడిచిపెట్టడం ద్వారా నేరాలు తగ్గాయన్నారు. రోడ్డుప్రమాదాలు తగ్గాయని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉందని, అక్కడక్కడ సెల్ఫ్ యాక్సిడెంట్‌లు తప్పితే గతంలో వున్న యాక్సిండెంట్‌లు లేవని చెప్పారు. ప్రజల చైతన్యంతోనే ప్రమాదాలు నివారణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రోడ్డుప్రమాదాల్లో శ్రీకాకుళంలో తక్కువగా ఉండడంతో సి ఎంతోపాటు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారన్నారు. ఇమ్రాన్‌షీజడఅన్సారీ నుంచి ఇన్‌వో కారులో రవాణా చేస్తున్న 182 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని, ఈ వ్యక్తి భువనేశ్వర్ నుంచి బొంబాయికి రవాణా చేస్తుండగా లక్ష్మిపురంటోల్‌గేటు వద్ద పట్టుకున్నామని, పడాల చిన్నారావు మూడు ఇళ్లుల్లో చోరీకి పాల్పడ్డాడని, వారి నుంచి 20 వేల రూపాయల నగదు, 4 ఎటి ఎం కార్డులతోపాటు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, ఎర్రముక్కాంకు చెందిన పుక్కల విజయ్ ఎటి ఎంల్లో కార్డులు మార్పిడి ద్వారా చోరీకి పాల్పడేవాడని, వారి నుంచి 8500 రూపాయల నగదుతోపాటు ఎటి ఎం కార్డును స్వాధీనం చేసుకున్నామని, తర్లాకోట పంచాయతీకి చెందిన సవర రామారావు ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడేవాడని, వారి నుంచి 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వజ్రపుకొత్తూరు మండలం, తిమ్మలవానిపేటకు చెందిన బాలనేరస్థుడు నుంచి 9 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కాశీబుగ్గ డివిజన్ పోలీసుసిబ్బందిని ఆయన అభినందించారు. ఎస్పీతోపాటు కాశీబుగ్గ డి ఎస్పీ వివేకానంద, సి ఐ అవతారం, ఎస్ ఐలు రామారావు, భాస్కరరావు తదితరులున్నారు.