శ్రీకాకుళం

‘సెర్చ్’ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 30: ఇక్కడ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ హెచ్.లజపతిరాయ్ పదవీకాలం మే 13వ తేదీతో పూర్తవనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ సమావేశం ఇప్పటికీ ఒక్కసారైనా నిర్వహించకపోవడంతో దరఖాస్తు చేసుకున్న ఆచార్యుల్లో మరింత ఉత్కంఠ ఆరంభమైంది. ఏప్రిల్ 20న అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితాదేవరాను రాష్ట్ర నామినీగా, యుజిసి నామినీగా ప్రొఫెసర్ దేవరాజ్, అంబేద్కర్ వర్శిటీ నామినీగా ప్రొఫెసర్ లక్ష్మీనాథ్‌లను ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కోసం 60మంది ఆచార్యులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించేందుకు మూడు పర్యాయాలు సమావేశం కావాల్సి ఉంది. నేటికీ ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం వీసి నియామకంలో మరింత జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను రెండు సమావేశాల్లో సమీక్షించి మూడో సమావేశంలో ముగ్గురు పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేయాల్సి ఉంది. ఇటువంటి సిఫార్సుల్లో ఒకరికి వీసి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇంతటి ప్రక్రియకు ప్రధాన భూమిక పోషించే సెర్చ్ కమిటీ మొదటిసారి సమావేశం కాకపోవడంతో ప్రస్తుత వీసిగా వ్యవహరిస్తున్న హెచ్.లజపతిరాయ్ ఈనెల 13న బాధ్యతల నుండి తప్పుకొని ఇక్కడ రెక్టార్‌గా పనిచేస్తున్న ఎం.చంద్రయ్యకు ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించనున్నారు. వీసి లజపతిరాయ్ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(అనంతపురం)కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతిగా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికైనా సెర్చ్ కమిటీ సమావేశం వేగంగా నిర్వహించి ఉప కులపతి నియామకంలో పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆచార్యులు కోరుతున్నారు. అంబేద్కర్ వర్శిటీతోపాటు రాష్ట్రంలో ఆంధ్రావిశ్వవిద్యాలయం(విశాఖపట్నం), యోగివేమన వర్శిటీ(కడప)లకు కూడా వీసిల నియామకం పూర్తిచేయాల్సి ఉంది.