శ్రీకాకుళం

శివాలయాలకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 23: కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. వేకువజామునుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. మొదటి సోమవారం ఎలాగైనా ఆలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకోవాలన్న లక్ష్యంతో భక్తులు తరలివెళ్లారు. పంచలింగాల్లో ఒకటైన నగరంలోని నాగావళి నదీ తీరంలో ఉన్న శ్రీ ఉమారుద్రకోటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిబ్బంది బ్రిడ్జికి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మణీనాగేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ కనిపించింది. ఇది కూడా పంచలింగాల్లో ఒకటి. పశ్చిమముఖంగా ఉండటం ఈ ఆలయం విశేషం. నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నగరవాసులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు తరలివెళ్లారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే నగరంలో పలు కూడళ్లలో ఉన్న శివాలయాల్లో కూడా భక్తుల రద్దీ కనిపించింది. ఆర్టీసీ కాంప్లెక్స్ , కృష్ణాపార్కు, పాత శ్రీకాకుళం, పి ఎస్ ఎన్ ఎం స్కూల్ ఎదురుగా ఉన్న పలు శివాలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. అలాగే రూరల్ మండలం రాగోలులో శైవక్షేత్రం, వాకలవలసలో దుర్గాపంచాయతన ఆలయంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు.

వైకాపా నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 23: వైకాపా నేతలు కనీస రాజకీయ అవగాహన లేకుండా గుండ దంపతులపై విమర్శలు చేస్తున్నారని టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ పేర్కొన్నారు. అరసవల్లిలోని ఎమ్మెల్యే నివాస గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్ టి ఆర్ నాయకత్వం నుండి ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా అనేక లెజిస్లేటివ్ కమిటీలకు అధ్యక్షునిగా ఎథిక్స్ కమిటీలకు సభ్యులుగా పనిచేసిన గుండ అప్పలసూర్యనారాయణ ప్రస్తుతం జిల్లా, రాష్టస్థ్రాయిలో కూడా పార్టీ సర్వసభ్య సమావేశాల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న విషయం గుర్తు చేశారు. పదేళ్ల మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండుసార్లు గెలిపిస్తే ఉత్తరాంధ్రాలో తొలి సి బి ఐ ముద్దాయిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి అపఖ్యాతి తెచ్చారని పేర్కొన్నారు. మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ వరుసగా నాలుగుసార్లు గెలిచి నియోజకవర్గానికి నీతివంతంగా ఎటువంటి అభియోగాలు లేని ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. గుండ స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నించడం అవివేకమన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు జయప్రకాశ్‌నారాయణ లాంటి వ్యక్తులు కూడా అప్పలసూర్యనారాయణను రాష్ట్రంలో నిజాయితీపరుడని గుర్తించి మాట్లాడిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగుండలక్ష్మీదేవి అభివృద్ధిలో దూసుకుపోవడం వల్లే గుండ దంపతులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈసమావేశంలో ఎస్ వి రమణమాదిగ, గొలివి కృష్ణారావు, ప్రధాన విజయరామ్, సుధాకర్, ఎస్.వెంకటరావు, చిట్టి నాగభూషణం, గంగు నాగేశ్వరరావు, కరగాన రాము, బి.రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.