శ్రీకాకుళం

అధికారులు నష్టాలపై నివేదికలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 16: ప్రస్తుత వర్షాలను దృస్టిలో పెట్టుకుని వ్యవసాయ అధికారులు రైతులు ఆదుకునేందుకు నివేదికలు అందించే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలిపారు. అంబేద్కర్ భవనం తన భర్త గుండ అప్పలసూర్యనారాయణ సాంఘీక సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేయడం జరిగిందని ప్రస్తుతం దాని ఆధునీకరణ కోసం జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి 1.90కోట్లతో ఏసి చేసేందుకు సీలింగ్, మరుగుదొడ్ల నిర్మాణం, వంటశాల వంటివి చేపట్టేందుకు నివేదికలు పంపితే సాంఘీక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ రావత్ ఆమోదం తెలుపుతూ జీవోలు విడుదల చేశారని తెలియజేశారు. బాపూజీ కళామందిర్‌లో కూడా ఏసీలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణానికి రూ.23కోట్లు మంజూరు చేస్తూ పాత్రునివలసలో రూ.6కోట్లతో ఇండోర్ స్టేడియం మంజూరు చేయడం, శంకుస్థాపన పనులు కూడా చేపట్టడం జరిగిందన్నారు. సాంకేతిక కారణాల వలన జాప్యం జరగడంతో ప్రజలకు ముఖ్యంగా క్రీడాకారులకు నిస్పృహ కలిగించే సందర్భంలో అసెంబ్లీ సమావేశంలోనూ అందుకు సంభాషించడం అధికారులతో సంప్రదించడంపై పనులు జరిపేందుకు చర్యలు తీసుకోమని కోరడంతో దానికి స్పందనగా మంత్రి రవీంద్ర పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలియజేశారు. క్రీడాయువజన సంక్షేమం విభాగంప్రత్యేక కార్యదర్శిసుబ్రహ్మణ్యం జిల్లాకు వచ్చి అధికారులుకు పనులు ప్రారంభించాలని నిర్దేశించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు.