శ్రీకాకుళం

ప్రభుత్వ లక్ష్యాలకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 16: సమాజాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావడం ద్వారా అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అన్నారు. నగరానికి చెందిన డ్వాక్రా గ్రూపులకు నాయకత్వం వహించిన వైశ్యరాజు వెంకటలక్ష్మీ ఆధ్వర్యంలో చేయూత స్వఛ్ఛంద సేవా సంఘం నూతనంగా ఏర్పాటైంది. వెంకటలక్ష్మీ ప్రతినిధుల బృందం కుమారి, సూరీడు, గౌరీ, వేణు, సింహాచలం, బాలామణి తదితరులు కలెక్టర్‌ను కలిసి తమ సంఘం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. సామాజిక సేవతోపాటు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సిక్కోలు యజ్ఞంలో నగరానికి సమీప గ్రామాల్లో మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు చైతన్యపరుస్తామని వారు కలెక్టర్‌కు వివరించారు. దీనికి తమవంతు సహకారం సంఘానికి ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.

కాన్‌కాస్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 16: కాన్‌కాస్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల మద్దతులో ఉద్యమాలు ఉదృతం చేస్తామని సిటు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాన్‌కాస్ట్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు 73వ రోజుకు చేరుకున్న సందర్భంగా కలెక్టరేట్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కాన్‌కాస్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకుని 20మందిని అరెస్ట్ చేశారు. వీరిని 1వ పట్టణ పోలీస్‌స్టేసన్‌కు తరలించారు. ఈసందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ కాన్‌కాస్ట్ యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఆగస్టు 23న పరిశ్రమ మూసివేయడంతో 650 మంది కార్మికుల రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండతో యాజమాన్యం కార్మిక చట్టాలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ విధానాల వలన జిల్లాలో చక్కెర, జ్యూట్, ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు మూతపడ్డాయని ప్రస్తుతం కాన్‌కాస్ట్ పరిశ్రమ మూతపడటంతో వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. 2017 మార్చి నుండి వేతనాలు చెల్లించకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని తెలియజేశారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్ చేశారు. కాన్‌కాస్ట్‌ం ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బొడ్డేపల్లి మోహనరావు, పింగలి రామచంద్రరాజు, పిర్లంగి రాము, బమ్మిడి రమణారావు, సాయిరాజ్, కె.రాజేష్, మొదలవలస లక్ష్మణరావు, సనపల సుందరరావు, నంబాళ్ల శ్రీనివాస్, శ్యాంఫిస్టన్స్ యూనియన్‌అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యాంసుందరరావు, రమణ లు సంఘీభావం తెలిపారు.

రిమ్స్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 16: రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదని తెలియజేస్తూ గురువారం బిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తూ నిరసన తెలియజేశారు. గత పదేళ్లుగా రిమ్స్‌లో పనిచేస్తున్నామని చాకిరి తప్ప జీతాలు పెంపుదల లేవని వారు పేర్కొన్నారు. జై బాలాజీ సంస్థ అధినేత కనిపించడం లేదని సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని పేర్కొన్నారు. రిమ్స్ డైరెక్టర్‌ను పలుమార్లు కలిసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలియజేశారు. అందుకు గురువారం బిక్షాటన కార్యక్రమాన్ని చేస్తూ నిరసన తెలియజేస్తున్నామని సంఘ నాయకులు తెలియజేశారు. యూనియన్ అద్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణ, రాజేంద్రప్రసాద్, నర్శింగరావు, బగాది శ్రీను, రామారావు, హెచ్.లక్ష్మణరావు, చిరంజీవులు, ఫౌండేషన్ వర్క్స్ మద్దతు తెలియజేశారు. శ్యామల, విజయ సంతోష్ అరుణ తవిటయ్య, ప్రసాద్, గనె్నమ్మ , సిటు డివిజన్ ఉపాధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.