శ్రీకాకుళం

ఆకాశమంత అభివృద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 3: అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం ఆకాశమంత అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి చెప్పారు. మరికొద్ది నెలల్లో నగరపాలక సంస్థ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా ఆమె ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. పదేళ్ళు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరిపాలించిన శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అనుభవం లేని లక్ష్మీదేవి పరిపాలన అసంపూర్ణంగా ఉంటుందంటూ రాజకీయ విశే్లషకులు సైతం విమర్శలు చేస్తున్న సమయంలో రెండేళ్లలో ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజాఅవసరాలను గుర్తించి వాటిని ప్రాధాన్యతాప్రాతిపదికపై పనులు పూర్తి చేయించగల సమర్థతకు, నియోజకవర్గం పరిపాలనలో అవినీతి మరకలు పడకుండా పార్టీ గౌరవాన్ని కాపాడుకుంటూ పాలన చేసినందుకే రాష్ట్రంలో నెం.1 ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం గ్రేడింగ్ ఇచ్చిందని చెప్పారు. నగరానికి శివారు పంచాయతీలు విలీనం చేస్తూ నిర్మిస్తున్న వంతెనలు, రోడ్లు రానున్న తరాలకు నవ్యశ్రీకాకుళం నగరంగా మార్చేస్తాయన్నారు. నగరానికి కూతవేటు దూరంలోనే విద్యాసంస్థలు, వైద్య నర్సింగ్ కళాశాల ఏర్పాటుకై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆ పనులకు మరికొద్దిరోజుల్లో శ్రీకారం చేస్తామని, బుధవారం ముఖ్యమంత్రి చేతులమీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకుగాను మంత్రి అచ్చెన్నాయుడు కృషితో 1500 లక్షల రూపాయలు కేటాయింపులు జరిగినట్టు చెప్పారు. రెండు వేల లక్షల రూపాయల నిధుల కేటాయింపులతో సింగుపురంలో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఆ మేరకు పనులు ప్రారంభకానున్నట్టు చెప్పారు. గార మండలంలో వమరవల్లి డైట్ ఎ.పి.రెసిడెన్షియల్ స్కూల్‌కి 193.30 లక్షలతో సరికొత్త హంగులు ఏర్పాటు చేసామని ఎమ్మెల్యే లక్ష్మీదేవి తెలిపారు. 206 లక్షలతో శ్రీకూర్మంలో ఆర్.హెచ్.సి., 180 లక్షలతో పి.ఎన్.కాలనీ రోడ్లు, 80 అడుగుల రోడ్డుకు 30 లక్షలతో వెలుగులు నింపామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సూచనలతో సిక్కోల్ నగరానికి భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 15,000 లక్షల రూపాయలతో అంచనాలు ప్రతిపాదించామని, త్వరలో ఆ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని చెప్పారు. మరో 15000 లక్షలతో సిక్కోల్‌కు రింగ్‌రోడ్డు నిర్మాణం ఎన్.హెచ్ -16(నవభారత్ జంక్షన్) వయా పొన్నాడ, అరసవెల్లి, పెద్దపాడు, సిద్దిపేట (ఎన్‌హెచ్-16) నిర్మాణానికి రంగం సిద్ధమైందని వివరించారు. కోడిరామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణానికి 1500 లక్షలు, నాగావళిపై పాతబ్రిడ్జిని 1800 లక్షలతో పూర్తిచేశామని, 2300 లక్షలతో పొన్నాడ వంతెన నిర్మాణం పూర్తయినట్టు ఎమ్మెల్యే లక్ష్మీదేవి వివరించారు. శ్రీకాకుళం నగరానికి కనెక్టవిటీగా ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు 6,000 లక్షలతో జిల్లాలో మొదటి స్థానంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో సిసి రోడ్లు నిర్మాణాలు జరిగాయని చెప్పారు.