శ్రీకాకుళం

వైసీపీ కార్యకర్తలు సైనికుల్లా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, డిసెంబర్ 12: గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు ఎటువంటి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా సైనికుల్లా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం చల్లవానిపేట జంక్షన్‌లో మంగళవారం జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మరో ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వానికి పతనం తప్పదని నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అవినీతి, అక్రమాలకు వైసీపీ కార్యకర్తలకు గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని, చంద్రబాబు మసిపూసి మారెడు కాయ విధానంగా పరిపాలన సాగిస్తున్నారని దీనిని విద్యావంతులు అర్థం చేసుకొని ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వం తీరుపై స్పష్టంచేయాలని తెలియజేశారు. కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి బగ్గు రామకృష్ణ, జెడ్పిటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు శ్యామలరావు, సీనియర్ నాయకులు కనుసు సీతారాం, పాగోటి రాజప్పలనాయుడు, నాగేశ్వరరావులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మండలంకు చెందిన ఎంపిటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.74లక్షలతో వసతిగృహాల్లో సదుపాయాలు
సారవకోట, డిసెంబర్ 12: పాలకొండ సాంఘిక సంక్షేమ అధికారి పరిధిలో 13వసతిగృహాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.74లక్షలు మంజూరైనట్టు ఏఎస్‌డబ్య్లూవో ప్రేమభూషణం తెలిపారు. స్థానిక సమీకృత వసతిగృహంలో విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేసిన సందర్భంగా మంగళవారం విలేఖర్లతో ఆయన మాట్లాడారు. వసతిగృహాలలో నిరంతర తాగునీరు సరఫరా మరుగుదొడ్ల సౌకర్యం, విద్యుత్, ఫ్యాన్‌లు వంటి సౌకర్యాలు కల్పించడానికి ఈ నిధుల ఖర్చు చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. అన్ని వసతిగృహాల్లోని విద్యార్థులకు దోమల బారి నుండి కాపాడుకోవడానికి దోమ తెరలు అందజేస్తున్నామని వీటిని జిల్లా మలేరియా నివారణ అధికారి సరఫరా చేశారని ఆయన స్పష్టంచేశారు. తన పరిధిలో ఈ ఏడాది 305మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని ఆంగ్లం, సైన్స్, గణితం, హిందీ పాఠ్యాంశాలకు సంబంధించి ట్యూటర్లను కూడా ఆయా వసతిగృహాలలో నియమించినట్టు వివరించారు. విద్యార్ధుల విద్యాప్రమాణాలను పరీక్షించిన అనంతరం సి,డి గ్రేడ్‌లలో ఉన్నవారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్థానిక వసతిగృహంలో 298మంది విద్యార్థులకు దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ వసతిగృహంలో 109 కిటికీలకు బయట నుండి దోమలు లోపలికి రాకుండా నివారించేందుకు మెస్‌లను ఏర్పాటు చేస్తున్నామని 50్ఫ్యన్‌లను కూడా అమర్చనున్నట్టు ఆయన వివరించారు. అదే విధంగా 10వ తరగతి విద్యార్థులకు నూతన పరీక్షా విధానంపై ప్రత్యేక పుస్తకాలను సరఫరా చేసినట్టు తెలిపారు.