శ్రీకాకుళం

యంత్రాల ద్వారా మొక్కజొన్న విత్తనాలు నాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, డిసెంబర్ 16: మండలం చిటవానిపేటలో యంత్రాల ద్వారా మొక్కజొన్న విత్తనాలు నాట్లు వేయడం జరిగిందని మండల వ్యవసాయాధికారి వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్రాల ద్వారా విత్తనాలు వేయడం వలన వరుస పద్దతిలో వస్తాయని, రబీలో కేవలం మూడు సార్లు నీరు పెట్టాలని , ఎరువులు వేయడానికి వీలుగా ఉంటుందని ఆయన సూచించారు. 40 నుండి 28 క్వింటాళ్లు ఎకరాకు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన రైతులకు అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవసరమయ్యే అనేక యంత్రాలను రాయితీ పై అందజేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది రమ, రైతులు రామకృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభైన ఎస్‌ఏ -1 పరీక్షలు
ఆమదాలవలస, డిసెంబర్ 16: స్థానిక మండలంమున్సిపాలిటీలో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం ఎస్ ఏ-1 పరీక్షలు పడక్భందీగా ప్రారంభమయ్యాయి. గతంలో ఈ పరీక్షపై జరిగిన తప్పిదాలు, అవకతవకలు పునరావృత్తం కాకుండా ఈ సారి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పకడ్భందీగా చర్యలు తీసుకున్నారు. అమరావతి నుండి ముందు రోజు విమానంపై ఈ పేపర్లు విశాకపట్నం చేరుకోగా అక్కడ నుండి జిల్లాకు చేరుకొని అర్థరాత్రి మండలాలకు వచ్చాయి. అధికారులు ఈ పరీక్షల నిర్వహణకు ముందురోజు ప్రత్యేక వాహనాల ద్వారా అందించారు. 2:45గంటల కాల వ్యవధి ఉంటుందన్నారు. ఈపరీక్ష పూర్తయిన తరువాత పాఠశాలనుండి ఎం ఆర్ సికి చేరుకున్నాయి. వీటితోపాటు 6,7,10వ తరగతి పరీక్షలు సాధారంగానే నిర్వహించారు. ఈనెల 19 నుండి 22 వరకు 1 నుండి 5 ఎస్ ఏ -1 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

గిరిజన యువతకు శిక్షణ
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 16: ఐ టి డి ఏ , ఏ పి ఎస్ ఎస్ డిసి, టాటాస్ట్రైవ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా కార్యక్రమం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న యూత్‌ట్రైనింగ్ సెంటర్‌లో గిరిజన యువతీ యువకులకు రెండు నెలల శిక్షణ ఇస్తున్నట్లు వైటిసి మొబలైజేషన్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎం.వాసుదేవరావు తెలిపారు. రిటైల్ సేల్స్ అసోసియేట్ అనే కోర్సును గిరిజన యువతకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించబడునని తెలియజేశారు. శిక్షణ అనంతరం సంబంధిత రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడునన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారై 18 -28 సంవత్సరాల మధ్య వయస్సుల గల నిరుద్యోగులు అర్హులన్నారు. ఈనెల 20 నుండి శిక్షణ నిర్వహించబడునని అభ్యర్దులు తమ జిరాక్సు కాపీలతో వైటిసి కేంద్రానికి హాజరు కావాలని తెలిపారు. ఈ కోర్సుకు బాలురు, బాలికలు అర్హులన్నారు. ఈ శిక్షణ కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా వారైనా దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలను 8979963620 నెంబరును సంప్రదించాలన్నారు.