శ్రీకాకుళం

సమ్మెటివ్ పరీక్షలకు 12వేలు మంది విద్యార్ధులు హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 16: మండలంలో విద్యాశాఖ ఆదేశాల మేరకు సమ్మెటివ్ పరీక్షలకు ప్రారంభించడం జరిగిందని ఎం ఈవో శాంతారావు తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ పరీక్షలను ఆయన పలు పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగుబోధన అంశాలను ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్ధులు ఏ మేరకు అవగాహన పరుచుకుంటున్నారో తెలుసుకునే విధంగా ఇది ఉపయోగపడతాయని వివరించారు. దీని ఫలితాల ఆధారంగానే రానున్న బోధనా తరగతుల్లో మరిన్ని మెళకువలతో విద్యార్ధులకు విద్యను అందించడం జరుగుతుందని స్పష్టంచేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 120 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించామని ఆయన స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ ఎంలు తదితరులు పాల్గొన్నారు.

పంటమార్పిడి విధానాన్ని అవలంబించండి
* కెవికె కో ఆర్డినేటర్ చిన్నంనాయుడు
నరసన్నపేట, డిసెంబర్ 16: వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయని సాంకేతికపరంగా కూడా ప్రభుత్వం రైతులకు అనేక సదుపాయాలను కలగజేయడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ వ్యవసాయ శాస్తవ్రేత్త అయిన చిన్నంనాయుడు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయంలో ఎంపి ఇవోల శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మరింత అవగాహన పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని యాంత్రీక విధానం పట్ల అలవాటు చేసే దిశగా తగు సూచనలు ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా పంటమార్పిడి విధానాన్ని అవలంభించాలని తద్వారా భూసారం పెరగడమే కాకుండా అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయని వివరించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఖరీఫ్‌లో ముందస్తు వరిసాగును చేపట్టాలని సూచనలు చేస్తున్నారని అయితే జూన్ నాటికి పూర్తిస్థాయిలో సాగునీరు అందించగలిగితే ఇది సాధ్యవౌతుందని స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి సత్యవతి, ఏవోలు శ్రీనివాసరావు, వెంకటరావు, ఆనందరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.