శ్రీకాకుళం

చంద్రబాబు మద్యాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు రాష్ట్రంలో మద్యం విక్రయాలను పెంచేందుకు ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్కరాష్టమ్రైన తెలంగాణాలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం లేకపోవడం బాదాకరమని ఆహ్వానం ఇవ్వకపోయినా సిగ్గులేకుండా ఇక్కడ జరిగే పరిస్థితిని చూసి బాదపడుతున్నారన్నారు. టిడిపిని ఎక్కడా ఆ గౌరవాన్ని ఉంచలేదనే భావనతో తెలంగాణా ప్రభుత్వం చంద్రబాబుకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ ఆర్ సమాధి కింద చంద్రబాబు పాతిపెట్టేశారని పేర్కొన్నారు. ఉత్సవాన్ని చూసి సంతోషిస్తున్నామని 8,000మంది ప్రతినిధులు హాజరైనట్లు తెలియజేశారు. టిడిపి సిద్ధాంతాలను ఎన్టీ ఆర్ సిద్ధాంతాలను కూడా ఆయన సమాది కింద పాతిపెట్టేశారన్నారు. మాద్యాన్ని కూడా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ, చేనేత కార్మికుల రుణాల మాఫీ అని హామీ ఇచ్చి దానిని విస్మరించారన్నారు. ప్రకృతి సంపదను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.11వేల కోట్ల మద్యం విక్రయం ద్వారా ఆదాయం చేకూరినట్లు తెలియజేశారు. ఇది ప్రజలకు జీవన్మరణ సమస్య అన్నారు. నారావారి సారా ప్రవాహాన్ని రాష్ట్రంలో ఆపాలని డిమాండ్ చేశారు. సి ఇ సి సభ్యులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రా కో ఆర్డినేటర్ భూమన కరుణాకర్ ఈనెల 17,18వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. 17 ఇచ్ఛాపురంలో అనంతరం పలాసలో సమవేశాలు నిర్వహిస్తారని తెలియజేశారు. 18న టెక్కలిలో, మధ్యాహ్నం 3గంటలకు నరసన్నపేటలో సమావేశాలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈరెండు రోజుల పర్యటనలో పార్టీ పెద్దలు పాల్గొంటారని కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఎన్ని ధనంజయ్, కె ఎల్ ప్రసాద్, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.