శ్రీకాకుళం

చైల్డ్‌రైట్స్ కమిషనర్ జిల్లా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ చైల్డ్‌రైట్స్ కమీషనర్ మెంబర్ పివివి ప్రసాద్ ఈ నెల 18 నుండి నాలుగు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. 18న స్థానిక స ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకొని అక్కడ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు బూర్జ మండల పరిషత్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. 19న ఉదయం 10గంటలకు అర్ అండ్‌బి అతిధిగృహంలో నాన్ అఫీసియల్స్‌తో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 11:30గంటలకు స్టేట్‌హోమ్‌ను తనిఖీ చేస్తారు. అలాగే 7గంటలకు ఆమదాలవలస చేరుకొని భస చేస్తారు. 20న ఆమదాలవలస నుండి పలాస చేరుకుంటారు. 21న ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలను తనిఖీ చేస్తారు. అలాగే స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఎస్‌ఎస్‌సి ఫీజు అధికంగా
వసూలు చేస్తే చర్యలు: డీఈవో
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 17: ఎస్ ఎస్ సి 2018లో జరగబోవు పరీక్షలకు గాను ఫీజు గరవ్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ నిర్ణయించిన ఫీజు కంటే అధనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధనంగా రూ.1500 నుండి రూ.2000 వరకు విద్యార్ధుల నుండి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వసూలు చేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ దృష్టికి వచ్చినట్లు తెలియజేశారు. అటువంటి పాఠశాలను తనిఖీ చేసి ఆరోపణలు నిర్ధారణ అయితే అటువంటి పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై ఆకస్మీక తనిఖీలు నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేసినట్లు తెలియజేశారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు
వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 17: స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో రోటరీక్లబ్, రాగోలుజెమ్స్ ఆసుపత్రి సంయుక్తంగానిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ఈశిబిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చర్మ,గైనిక్,కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైనవారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే బి.పి. షుగర్ పరీక్షలను కూడా నిర్వహించారు. జెమ్స్ ఆసుపత్రి వైద్యులు చందన్,యోగి, సుభానీలు పారిశుద్ధ్యకార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలకు హాజరైన వారికి ఉచితంగా అల్పాహారం కూడా ఇచ్చారు. భవిష్యత్‌లో స్వచ్ఛంద సంస్థలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సుమారు 200మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ దవళ భాస్కరరావు, అసిస్టెంట్ కమీషనర్ ఎం.జీవరత్నం, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, ఎంర్ కె దాస్,రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు రాజులు, డి.శివశంకర్, నిక్కు అప్పన్న, ఎస్.అప్పారావు, కె.వి రామ్‌గోపాల్, వర్మ తదితరులు పాల్గొన్నారు.