శ్రీకాకుళం

పేదలకు అన్నం పెట్టింది ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జనవరి 18: పేద బడుగు బలహీనవర్గాలు నాలుగు పూటలా అన్నం తినేలా రెండు రూపాయలకే కిలో బియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి , తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు అని జిల్లా పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ కొనియాడారు. మండల కేంద్రమైన ఎచ్చెర్లలో ఘనంగా టీడీపీ శ్రేణులు ఎన్టీ ఆర్ వర్థంతిని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాబ్జీ మాట్లాడుతూ 9 నెలల్లోనే పార్టీని స్థాపించి కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించి గద్దెనెక్కిన ఘనత ఎన్టీ ఆర్‌కే దక్కిందన్నారు. కూడు, గూడు, నీడ అనే నినాదంతో జనత వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మండల వ్యవస్థ వంటి కార్యక్రమాలను నిర్వహించి పేదలకు సంక్షేమ, ప్రభుత్వ ఫలాలు మరింత దగ్గరకు చేర్చారన్నారు. ఇటువంటి మహనీయుడు అడుగుజాడల్లో సి ఎం చంద్రబాబు పయనించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, నవ్యాంధ్రను అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఎన్టీ ఆర్ , చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా తెలుగుతమ్ముళ్లు పార్టీని బలోపేతం చేసేందుకు అభివృద్ధి పథకాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, జీరు రామారావు, మెండ రాజారావు, చౌదరి అవినాస్, అనె్నపు భువనేశ్వరరావు, గాలి వెంకటరెడ్డి, కోటిరెడ్డి, నాగిరెడ్డి, బోర వెంకటరావు, కడుపు శేఖర్, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు పాల్గొన్నారు. ఎన్టీ ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. టీడీపీ సీనియర్ నేతలను ఈ సందర్భంగా సత్కరించారు.
* మెగా రక్తదాన శిబిరం
అన్న దివంగత సిఎం ఎన్టీఆర్ వర్థంతిని పురష్కరించుని స్థానిక పిహెచ్‌సిలో ఎచ్చెర్ల నియోజకవర్గం స్థాయి రక్తదాన శిబిరాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ శిబిరాన్ని ఎంపిపి రమణారెడ్డి ఆసుపత్రి కమిటీ చైర్మన్ పైడి అన్నంనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావులు ప్రారంభించారు. వివిధ మండల నుంచి సుమారు 100మంది రక్తదానం చేశారు. వీరికి ధృవపత్రాలను అందజేశారు. ఎంపిపి రమణారెడ్డి కుమార్తెలు, జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ కుమారుడు అవినాష్‌లతో పాటు మంత్రి కళావ్యక్తిగత కార్యదర్శి కృష్ణంనాయుడులు రక్తాన్ని దానం చేసి యువతలో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో రణస్థలం ఎంపిపి గొర్లె విజయకుమార్‌నాయుడు, నడుకుదిటి ఈశ్వరరావు, లంక శ్యామ్, ముప్పిడి సురేష్, పిన్నింటి మధుబాబు, మీసాల వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, సిహెచ్‌వో లక్ష్మణరావు, తహశీల్దార్ కిమిడి రామ్మోహనరావు, బీసీ కార్పొరేషన్ ఇడి రాజారావు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపిటీసీలు , పార్టీ నేతలు పాల్గొన్నారు.