శ్రీకాకుళం

సంక్షేమానికి మారుపేరు నందమూరి: ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జనవరి 18: అభివృద్ధి... సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగించిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని స్తానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి అన్నారు. ప్రజా క్షేమం కోసం అహర్నిశలూ పాటుపడి సంక్షేమానికి మారు పేరుగా కీర్తింపబడ్డ మహోన్నతమైన వ్యక్తి అన్నారు. సమాజంలో రాజకీయ విలువలు నేర్పిన వ్యక్తి దివంగత నందమూరి తారకరామారావు అని.. అవినీతి మరకలు లేనిది తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 22వ వర్ధంతి సందర్భంగా మండలం పూసర్లపాడు గ్రామంలో స్థానిక సర్పంచు ప్రతినిధి అరవల పెదబాబు నేతృత్వంలో రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణలు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునే అలవాటు లేని వ్యక్తి నందమూరి తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి.. సంక్షేమం అంటే ఏమిటో రుచి చూపించిన ప్రపధమ ముఖ్యమంత్రి రామారావు అన్నారు. రెండు రూపాయలుకే కిలో బియ్యం, రాయితీపై బట్టలు, గృహాలు వంటి కార్యక్రమాలుతో పాటు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్సన్లు వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి మొట్టమొదట మంజూరు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పాలనలో తెలుగుదేశం పార్టీదే అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే పంధాలో పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఆత్మాభిమానం.. ఆత్మగౌరంకు మారుపేరు స్వర్గీయ రామారావు అన్నారు. సమాజంలో రాజకీయ విలువలు నేర్పిన మహనీయుడన్నారు. గ్రామాలు వౌళికంగా అభివృద్ధి చెందుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే అన్నారు. అభివృద్ధి.. సంక్షేమంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వరకు భాగస్వామ్యం అయ్యింది అన్నది నేడు గ్రామాల్లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. ఆంధ్రుల కష్టసుఖాలను అర్ధం చేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అవినీతి రహిత విధానాలుకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అన్నారు. పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే ఉంటుందన్న చందాన వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు వ్యవహరిస్తున తీరు బాధాకరమన్నారు. అవినీతిలో మునిగిన మీరా మాకు అవినీతి మరకలు అంటించి.. ఆరోపణలు చేసేది.. అంటూ ఎద్దేవా చేసారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ అరవల మోహనరావు, మండల అధికార ప్రతినిధి గుండ భాస్కరరావు, శ్రీకాకుళం మార్కెటింగ్ కమిటి అధ్యక్షుడు పీస వెంకటరమణమూర్తి, సర్పంచులు బడగల వెంకటప్పారావు, కొంక్యాణ ఆదినారాయణ, గొండు వెంకటరమణమూర్తి, పి.క్రిష్ణమూర్తి, కొయ్యాన జగదీష్, ఆరంగి దశరధరావులతో పాటు ఎం.పి.టి.సి.లు కోరాడ వెంకటరావు, జల్లు రాజీవ్‌లతో పాటు నేతలు వి.ఎస్.గిరి, గోర సురేష్, చల్ల శ్రీనివాసరావు, మళ్ల అబ్బాయినాయుడు తదితరులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.