శ్రీకాకుళం

ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులకు మందులు సరఫరా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 19: శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాద పడుతున్న వ్యక్తులకు ప్రత్యేక మందులు సరఫరా చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతిలో రెండు రోజులపాటు జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ జిల్లాకు అవసరమైన అంశాలను వివరించారు. జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి వరకు ప్రచారం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఉందని, డయాలసిస్ పరిస్థితుల్లో అనేకమంది వ్యాధి గ్రస్తులు ఉన్నారన్నారు. వారికి ప్రత్యేక మందులు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌కు కొంతమంది వెళ్తున్నారని వారికి పింఛన్ మంజూరు అంశం పరిశీలించాలని ఆయన కోరారు. దీనిపై వీరఘట్టం మండలం టెట్టంగి గ్రామంలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. కొత్తూరు, సీతంపేట, కవిటి సామాజిక ఆసుపత్రులకు అవసరమగు సామాగ్రిని సరఫరా చేయాలని కోరారు. కవిటి సామాజిక ఆసుపత్రికి 30 పడకలకు అనుగుణంగా సిబ్బందిని మంజూరు చేయాలన్నారు. పూర్తిస్థాయి నెఫ్రాలజీయూనిట్‌ను రిమ్స్‌లో ఏర్పాటు చేయాలని కిడ్నీట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన కేసులకు మందులు అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. నర్శింగ్ కళాశాలకు తగిన పోస్టులు మంజూరు చేయాలని, వైద్య విద్యార్దులకు వసతిసౌకర్యం మంజూరు చేయాలని కోరారు. రిమ్స్ ఆసుపత్రికి నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, సూపర్‌స్పెషాలిటీ పోస్టులను మంజూరు చేయాలని వివరించారు. రిమ్స్ వైద్య కళాశాలలో వైద్య సీట్లు 100 నుంచి 150కు పెరిగాయని ఆ మేరకు అధ్యాపకులు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వీటితోపాటు జిల్లాకు అవసరమగు ఇతర అంశాలను ప్రస్తావించి మంజూరు చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బీసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రాజారావు, సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పి.జె ఎస్ ఎన్ పట్నాయక్, సెట్ శ్రీ సి ఈవో వరప్రసాదరావు, పర్యాటక అధికారి నారాయణరావు, జెడ్పి ఉప కార్యనిర్వహణాధికారి లక్ష్మీపతి, డి ఎస్ డివో బి.శ్రీనివాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

22 నుంచి ఉపాధి పనులు ప్రారంభించాలి
* డుమా పీడి కూర్మారావు

శ్రీకాకుళం, జనవరి 19: ఈ నెల 22 నుంచి జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ, ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని డుమా పీడి హనుమంతు కూర్మారావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏపివోలు, టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపిడిలు , డుమా కార్యాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు ప్రారంభించేందుకు క్షేత్ర సహాయకులు మేట్లను అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మంచి వాతావరణంలో మండల స్థాయి సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడం ద్వారా ప్రగతిని సాధించవచ్చునన్నారు. ఈ ఏడాది రూ.165 కన్న ఎక్కువ వచ్చేలా సాంకేతిక సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధమిక దశలో మార్కింగ్ ఇచ్చి పనులు చేపట్టడం ద్వారా వేతనదారుల్లో కొలతలపై అవగాహన తీసుకురావాలన్నారు. ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాలు రూపంలో రూ.232 కోట్లు చెల్లింపులు జరిపామని, అదే విధంగా రూ.130 కోట్లు పనులు చేపట్టామన్నారు. రహదారులు, ఇతర మెటీరియల్ పనులకు రూ.240 కోట్లు మంజూరయ్యాయన్నారు. మార్చి 31లోగా పనులు చేయడం ద్వారా వేతనాల రూపంలో వేతనదారులకు రూ.240కోట్లు చెల్లింపులు జరపాలన్నారు. ఇప్పటివరకు 26,147 కుటుంబాలు వంద రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్నారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, 17,452 పనులు జరుగుతున్నాయని అవి వివిద స్థాయిల్లో ఉన్నాయన్నారు. 2018-19 లేబర్‌బడ్జెట్ తయారీలో పనులు లేవని కూలీలు చలించకుండా ప్రత్యామ్నాయ పనులు గుర్తించి అంచనాలు తయారు చేయాలన్నారు. వేతనదారునకు రూ.197 వేతనం వచ్చేలా సిబ్బందికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నగేష్ మాట్లాడుతూ వెల్త్‌మేనేజ్‌మెంట్ యూనిట్లు సత్వరం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆదేశించిందని వాటిని సత్వరం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపిడిపిలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.