శ్రీకాకుళం

మత్స్యకారులను ముంచిన మంత్రి అచ్చెన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జనవరి 23: ఎన్నికల్లో మత్స్యకారులపై వల వేసి కల్లబొల్లి మాటలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యాక ఆ మత్స్యకారులను నిలువునా ముంచేసిన ఘనత మంత్రి అచ్చెన్నాయుడుకే దక్కుతుందని జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు ద్వజమెత్తారు. ఎన్నికల ముందు మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం వాటిని ఎస్టీ జాబితాలో చేర్చకుండా, ఎమ్మెల్సీస్థానం కూడా కల్పించకుండా నేడు టెక్కలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు జీవనాధారం కోల్పోయే విధంగా మంత్రివర్గ సమావేశంలో భావనపాడు పోర్టు నిర్మాణంపై ఆమోదముద్ర వేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏ మత్స్యకారులైతే మంత్రి అచ్చెన్నను గెలిపించారో సుమారు నాలుగేళ్లు పూర్తయినా వారి హామీని తుంగలో తొక్కినందువల్లే నేటికి 44 రోజులుగా మత్స్యకారులు నిరాహార దీక్షలు చేస్తుంటే బాధ్యత గల జిల్లా మంత్రిగా అటువైపు కనె్నత్తి చూడకపోవడం ఆయన అహంకరానికి నిదర్శనమన్నారు. మంత్రివర్గ సమావేశంలో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందన్న భావం వ్యక్తపరచగా తిరిగి మంత్రికి లబ్ధిచేకూరే విధంగా భావనపాడు పోర్టు నిర్మించి దాని ద్వారా కాకరాపల్లి ఫ్యాక్టరీకి బొగ్గు రవాణా సౌకర్యం కల్పించేందుకే చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మత్స్యకారులు నిజం తెలుసుకుని మంత్రి అచ్చెన్న చేసిన మోసానికి పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై న్యాయపోరాటానికి సిద్ధం కావాలని అందుకు వారికి వైసీపీ అండగా ఉంటుందన్నారు. వేలాది మంది మత్స్యకారుల కుటుంబాలు ఇంత అల్లకల్లోలం అవుతున్నా పట్టించుకోని మంత్రి భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.