శ్రీకాకుళం

శ్రమిస్తేనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఫిబ్రవరి 20: విద్యార్థులు శ్రమిస్తేనే విజయం వరిస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు అన్నారు. ప్రతిభ, షిర్డిసాయి కాలేజిలో వీడ్కోలు సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ దశ చాలా కీలకమని, భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరుకోవాలంటే ఈ దశ చాలా ముఖ్యమన్నారు. విద్యార్థులు, క్రమశిక్షణతో పట్టుదలతో విద్యాభ్యాసం చేసినట్లైతే విజయం వరిస్తుందన్నారు. సత్‌ప్రవర్తన, స్నేహభావం విద్యార్థులకు ముఖ్య లక్షణాలు అని, వాటిని విస్మరించకుండా ముందుకు సాగితే పాఠశాలకు పేరుప్రఖ్యాతులు తీసుకువస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అంబికా ప్రసాద్, కాలేజి డైరెక్టర్లు యవ్వారి మోహనరావు, పున్నయ్య, రిటైర్డు ప్రిన్సిపాల్ మెట్ట రాజగోపాలరావు, నర్శింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

బిజెపితోనే అభివృద్ధి సాధ్యం
పలాస, ఫిబ్రవరి 20: బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని బిజెపి పార్టీ సీనియర్‌నాయకులు, మాజీ ఎంపి కణితి విశ్వనాధం అన్నారు. మంగళవారం బిజెపి ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా కొత్తవూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపితోనే కేంద్ర,రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా రాష్ట్ర పాలకులు వాటిని బహిరంగపరచడం లేదని, కేంద్రం అండ లేకుండా రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెంది ఉండేది కాదన్నారు. బిజెపి నాయకులు పాలవలస వైకుంఠరావు, తమ్మినేని మాధవరావు, కొర్రాయి బాలకృష్ణ, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌లకు దీటుగా ఫలితాలు సాధించాలి
పలాస, ఫిబ్రవరి 20:కార్పొరేట్ పాఠశాలకు దీటుగా పలాస ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫలితాలు సాధించాలని ప్రముఖ వ్యాపారి తర్లాన రమేష్ అన్నారు. పలాస ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే ఫేర్‌వెల్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఈ దశలోనే విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తే భవిష్యత్తు అంతా ఉన్నతంగా తయారవుతుందన్నారు. చదువు జ్ఞానంతోపాటు సంస్కారం కూడ నేర్పుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల అని చిన్నచూపు తగదని, ఇక్కడి విద్యార్థులు కూడ శ్రమిస్తే 10/10 మార్కులు సాధించగలరన్నారు. శతశాతం ఉత్తీర్ణత పాఠశాలగా పేరు తేవాలన్నారు. ఉపాధ్యాయులు కూడ మరింత శ్రమించి ఉత్తమ ఫలితాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రామారావు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించగా, స్థానిక వ్యాపారులు కూడ సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమన్నారు. శతశాతం ఫలితాలు కోసం ఉపాధ్యాయ బృందం అంతా కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు కూడ క్రమశిక్షణ, సాంకేతికతో కూడిన విద్యను అభ్యసించినట్లైతే ఫలితాలు సాధన కష్టమేమి కాదన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజి పిన్సిపాల్ సిహెచ్ శరత్‌బాబు, మాల్లా భద్రయ్య, బి.వెంకటరావు, కె.మధుబాబు, సుడియా సత్యానారాయణ, మల్లా కామేశ్వరరావు, ఎస్.సురేషు తదితరులు పాల్గొన్నారు.