శ్రీకాకుళం

చిన్నారి ప్రాణాన్ని...‘చదువు’ చిదిమేసింది!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 16: ఆ చిన్నారి చదుల్లో..ఆటపాటల్లో ఎప్పుడూ మంచి స్థానంలో ఉండేది. అటు ఇంటిలోనూ ఆమె అంటే తల్లిదండ్రులకు ఎంతో ముద్దు. కానీ, ఏం కష్టం వచ్చిపడిందో అంత చిన్న వయస్సులో కఠినమైన నిర్ణయం తీసుకుంది. అన్నం నేను వండుతాను నాన్నా...అమ్మను డ్యూటీ నుంచి తీసుకురా అని చెప్పి..తాను అనంతలోకాలకు వెళ్ళిపోయింది. శ్రీకాకుళం నగరంలో 6వ. తరగతి చదువుతున్న 11 ఏళ్ళ చిన్నారి త్రివేణీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఆత్మహత్య...ఈ తలంపువస్తేనే నిలువెల్లా వణికిపోతుంటాం. కానీ, ఇప్పుడు అభం శుభం తెలియని చిన్నారులు సైతం తృణప్రాయంగా ప్రాణాలను త్యజించి ఉరేసుకుంటున్నారు. 11 ఏళ్ళు చిన్నారి ఆత్మహత్యకు పాల్పడటం..అందుకు పరిస్థితులు గమనిస్తే..
శ్రీకాకుళం నగరంలో పాతహౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య లక్ష్మీ సైతం ఓ వస్తద్రుకాణంలో సేల్స్‌గర్లగా పనిచేస్తూ భర్తకు సపోర్టుగా ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు విశాఖపట్నంలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లో ఉంటూ 10వ. తరగతి చదువుతుండగా, 11 ఏళ్ళ కుమార్తె త్రివేణి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. ఎప్పుడూ ఎంతో చలాకీగా ఉండే త్రివేణీ ఆటపాటల్లోనే కాదు చదువులోనూ ఎప్పుడూ ఫస్టే. దీంతో ఆమె టాలెంట్‌కు మెచ్చుకుని పాఠశాల యాజమాన్యం 50 వాతం ఫీజులో రాయితీ కల్పించారు. ఐతే కొద్దికాలంగా త్రివేణీ పాఠశాలకు సరిగ్గా హాజరుకావడంలేదు. దీంతో బాగా చదివే అమ్మాయివి మార్కులు తగ్గిపోతే ఎలా అంటూ యాజమాన్యం ఆమెను రండు వారాలు క్రితం నాలుగు రోజులపాటు పన్మిష్‌మెంటు కింద దిగవ తరగతిలో కూర్చోబెట్టారు. స్కూలుకు సరిగా అటెండ్‌కాకపోవడంపై వివరణ కోరుతూ తల్లిదండ్రులను తీసుకురమ్మని చెప్పారు. దీంతో తల్లి లక్ష్మీని వెంటబెట్టుకుని త్రివేణి పాఠశాలకు వెళ్ళింది. స్కూల్‌కు పంపించకుండా ఫంక్షన్స్‌కు తీసుకెళ్తున్నారని త్రివేణి చెప్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ఆమె తల్లి లక్ష్మీని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదంటూ స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్ ముందే త్రీవేణీని ఆమె తల్లి తీవ్రంగా మందలించింది.
ఈ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత నిన్న గురువారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో త్రివేణీ ఉరేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని రిమ్స్‌కు తరిలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్‌లో తమ కుమార్తెను మందలించడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండివుంటుందని పోలీసులతో త్రివేణి తల్లిదండ్రులు అనుమానాలను వ్యక్తం చేసారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల వరకూ తనతోనే కుమార్తె ఉందని, తన భార్యను డ్యూటీ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్ళి వచ్చేలోపే ఉరిపోసుకుని చనిపోయి ఉందంటున్నాడు త్రీవేణీ తండ్రి దిగువ తరగతిలో కూర్చోబెట్టినందుకే చనిపోయిందా? లేక తన తోటి పిల్లలు గేలి చేయడం వల్ల చనిపోయిందా?? తమకేమీ అర్థం కావడంలేదంటూ త్రివేణి తండ్రి కంటనీరు పెట్టుకున్నారు. ఐతే స్థానికంగా మాత్రం వేరే వాదనలు వినిపిస్తున్నాయి. వేణు,లక్ష్మీల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటాయి. కుటుంబకలహాలకు తోడు తల్లి లక్ష్మీ, స్కూల్ ప్రిన్సిపల్ ముందు తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడటంతో మరింత కుంగిపోయిన త్రివేణీ తీవ్ర మనస్తాపానికి గురై ఇలా చేసి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఐతే - పోలీసులు మాత్రం దర్యాప్తు చేసి ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని టూ టూన్ ఎస్సై చిన్నంనాయుడు సుస్పష్టం చేసారు.

శ్రీకాకుళం జిల్లాను..ఓ.డి.ఎఫ్.గా తీర్చిదిద్దాలి!!

శ్రీకాకుళం, మార్చి 16: జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత (ఓ.డి.ఎఫ్)జిల్లాగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ రాంపాల్ సింగ్ అన్నారు. ఓ.డి.ఎఫ్.పై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అండర్ సెక్రటరీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ.డి.ఎఫ్.గా తీర్చిదిద్దడంలో ఇంకా వేగం పుంజుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికి 15 గ్రామపంచాయతీలు మాత్రమే శత శాతం ఓ.డి.ఎఫ్.గా పంచాయతీలుగా ఉన్నాయని అన్నారు. దీర్ఘకాలం నుంచి ఈ సంఖ్య పెరగడం లేదని తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అటవీ ప్రాంతాల్లో సైతం మరుగుదొడ్ల నిర్మాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా తగు సూచనలు జారీ చేసామని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం ముమ్మరంగా జరుగుతోందన్నారు. జిల్లాలో 4.09 లక్షల గృహాలు ఉండగా, 2.92 లక్షల గృహాల్లో ఇప్పటికే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయ్యాయని చెప్పారు. మార్చి 31 నాటికి 1,17,052 మరుగుదొడ్లు నిర్మించాల్సివుందని అందులో 77,052 మరుగుదొడ్ల నిర్మాణానికి పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఇంకా 33,023 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభించాలని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారానికి వీటిని పూర్తి చేయగలమని ఆయన వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 71.40 శాతం నిర్మాణాలు ఊర్తి చేసామని తెలిపారు. రోజుకు 4000 చొప్పున్న నిర్మించాల్సివుందని అన్నారు. అటవీప్రాంతంలో నిర్మాణాలకు అటవీనిబంధనలు అడ్డువస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈవో బి.నగేష్, డి.ఆర్.డి.ఎ. పీడీ కిషోర్‌కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీరు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.