శ్రీకాకుళం

ఏప్రిల్ 1 నుండి విధిగా హెల్మెట్ ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 20: ఏప్రిల్ 1 నుండి జిల్లాలో అన్ని రహదారుల్లోనూ హెల్మెట్‌ధారణ అమలు చేసేందుకు జిల్లా స్థాయి రహదారి భధ్రతా కమిటీ నిర్ణయించింది. జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఇప్పటికే జాతీయ రహదారిపై హెల్మెట్ ధారణ నిబంధనను అమలు జరుగుతున్న సంగతి విధితమే. శ్రీకాకుళం నగరంలో సైతం ఈ నెల 15 నుండి హెల్మెట్ ధారణ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ 10వ తరగతి పరీక్షల రీత్యా కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన అనంతరం ఈ నిబంధనను అమలు చేసేందుకు నిర్ణయించారు. జాతీయ రహదారిపై హెల్మెట్ నిబంధన ఖచ్చితంగా అమలు చేయడం వలన ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రతా రీత్యా హెల్మెట్ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు. సుప్రీం కోర్టు సైతం మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం స్పష్టమైన నిర్దేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ప్రాణం విలువైనదేనని ఆయన పేర్కొంటూ స్వయం రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణలో భాగంగా రహదారులపై స్ట్ఫార్ బోర్డుల ఏర్పాటుకు, ఇతర వౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.14లక్షలు మంజూరు చేశామని తెలిపారు. తక్షణం స్ట్ఫార్ బోర్డులు ఏర్పాటు చేయాలని, రవాణా పోలీసు శాఖలను సూచించారు. రహదారులు, భవనాల శాఖ పంచాయతీ రాజ్ శాఖలకు స్పీడ్‌బ్రేకర్లు, జీబ్రాక్రాసింగ్ తదితర వౌలిక సదుపాయాలకు కల్పనకు రూ.13లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పలాస 50 పడకల ఆసుపత్రిలో ట్రామాకేర్ కేంద్రం ఏర్పాటుకు రూ.8లక్షలు కేటాయించామని తెలిపారు. సంబంధిత సౌకర్యాలు త్వరితగిన ఏర్పాటు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి.సూర్యారావును ఆదేశించారు. గోల్డెన్ హవర్ సమయంలో ట్రామాకేర్ సేవలే అత్యావస్యమని చెప్పారు. ట్రామాకేర్‌కు అవసరమగు ఇతర సదుపాయాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుండి సమకూర్చాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు, వాహనాలు ఆగిపోయినప్పుడు వాటిని పక్కకు తీసేందుకు, రాంగ్‌పార్కింగ్ వంటి సమయాల్లో త్రోయింగ్‌వెహికల్ అవసరమని, దానిని సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే నగరపాలక సంస్థ టెండర్లను పిలవడం జరిగిందని సహాయ సిటీప్లాన్ తెలిపారు. జాతీయ రహదారి పొడవున రహదారి భద్రతా అంశాలను గుర్తించాలని, జాతీయ రహధారి సంస్ధ అధికారులను ఆదేశించారు. జంక్షన్‌ల వద్ద జంబ్లింగ్ స్టిక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో గల హోర్డింగ్‌లపై ,రహదారి భద్రతకు సంబంధించిన అవగాహన కల్పించే అంశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కాంగ్రెస్‌కు హోదాపై ప్రశ్నించే హక్కు లేదు
* బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం
శ్రీకాకుళం(రూరల్), మార్చి 20: ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తున్నామని అంటున్నారని, మరి చట్టంలో ఈ అంశాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే బీజేపీ కేంద్ర,ప్రభుత్వం ఎక్కువగా నిధులను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని మొన్నటివరకు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటమార్చి ఎన్నికల్లో లబ్ధికోసం ప్రత్యేక హోదా అంశాన్ని తిరిగి తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కాకపోయినా రాష్ట్రానికి మేలు జరగాలంటే ఎక్కువ నిధులు రావాలని అన్నారని దానికి బీజేసీ స్వాగతిస్తుందన్నారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు బీజేపీ గొఱ్ఱెతోకతో పోల్చారని మరి ఆ తోక సహాయంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాలో జిల్లా ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్నారు. పూడి తిరుపతిరావు మాట్లాడుతూ మొన్న తిరుపతిలో కృషి ఉన్నత మేళ పేరుతో పెద్ద సమ్మేళనం జరిగిందని రైతులకు ఉత్పత్తి ధరకు 50శాతం అధికంగా కలిపి మద్దతు ధరను ప్రకటించడం జరిగిందన్నారు. టీడీపీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బినామీ పేర్లతో ఆర్ ఆర్ ప్యాకేజీ నిధులను దోపిడీ చేస్తుందని, అలాగే కాంట్రాక్టర్ల ద్వారా ప్రాజెక్టుల నిధులను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. వంశదార, పోలవరం, హంగ్రీనీవ, గాలేరు మొదలైన ప్రాంతాల్లో నిర్వాసితుల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయని ఈ నిధులు దుర్వినియోగంపై సి బి ఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ కోరుతున్నట్లు తెలిపారు.