శ్రీకాకుళం

హోదా కోసం పవన్ వెంట నడుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), మార్చి 21: ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్‌కల్యాణ్ వెంట తాము నడుస్తామని స్థానిక జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు నినదించారు. బుధవారం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, పాలకుల పనితీరును ఎండగడుతూ ఏలాం కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద అభిమానులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్యాకేజీ కోసం మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు హోదా కావాలని బిజెపిని నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌పై బురద జల్లడం సమంజసం కాదన్నారు. పార్టీలకతీతంగా అవినీతిపై మాట్లాడుతున్న ఆయనకు ప్రజలు వెంట ఉన్నారని చెప్పారు. విభజనతో నష్టాలు, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉందన్నారు. విభజన హామీలు నెరవేర్చే దిశగా పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు. యువత నిర్వీర్యమైతే రాష్ట్రం అదోగతి పాలవుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరును ఎండగట్టారు. రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. హోదాతో పాటు విభజన హామీలను అమలు చేసే వరకు తమ అధినేత పవన్‌కళ్యాణ్ వెంట ప్రజలంతా ఏకతాటిపై నిలిచి రావాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు పలువురు అభిమానులు, జనసేన కార్యకర్తలున్నారు.

చిన్నారి హత్యకేసులో తండ్రి అరెస్టు
కొత్తూరు, మార్చి 22: మండలం మెట్టూరు ఆర్‌అండ్ ఆర్ కాలనీలో నివాసముంటున్న జమ్మాన సింహాచలం ఏ పాపం ఎరుగని నాలుగేళ్ల కుమార్తె కరుణ హత్య కేసు సంఘటన తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి చిన్నారి కరుణ తండ్రి సింహాచలాన్ని బుధవారం అరెస్టు చేసినట్టు సి ఐ శ్రీనివాసరావు తెలిపారు. విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ సింహాచలం, అతని భార్య అన్నపూర్ణ మధ్య విబేధాలు కారణంగా కుమార్తెను తండ్రి హత్య చేసినట్టు దర్యాప్తులో రుజువైందన్నారు. అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచినట్టు సి ఐ తెలిపారు.

వేసవి దృష్టిలో పెట్టుకొని గస్తీ పెంచండి
డి ఎస్‌పి స్వరూప
పాలకొండ (టౌన్), మార్చి 21: ప్రజలకు శాంతిభద్రతల్లో ఎటువంటి విఘాతాలు కలగకుండా వేసవిని దృష్టిలో పెట్టుకొని గస్తీ పెంచాలని డి ఎస్‌పి స్వరూప సూచించారు. బుధవారం డివిజన్ పరిధిలోని సి ఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతాల వారీగా ఆమె నేరాల అదుపు కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలపై తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, రహదారులు పోలీసుల నిఘా పెరగాలని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో స్నేహభావంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సి ఐలు బి. ఎస్. ఎస్.ప్రకాష్, వేణుగోపాలరావు, సూరునాయుడులతో పాటు పలువురు పాల్గొన్నారు.

నివగాంలో తిష్టవేసిన గజరాజులు
కొత్తూరు, మార్చి 21: మండలంలోని నివగాం ప్రాంతంలో గత నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు తిష్టవేశాయి. బుధవారం కూడా నాలుగు ఏనుగుల గుంపు నివగాం ప్రాంతంలోని అరటి, మొక్కజొన్న వంటి పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామ పరిధిలోని అరటి,సరుకుడు తోటలు అత్యధికంగా ఉండడంతో ఎక్కడికీ వెళ్లకుండా తిష్టవేసి పంటలను నాశనం చేస్తున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వెల్లబుచ్చారు. పంటలను నాశనం చేయడమే కాకుండా పలువురిపై దాడి చేసి మృతికి కారణమవుతున్నా వీటిని తరలించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం, పాలకులు స్పందించి ఏనుగులను ఇక్కడ నుంచి తరలించాలని కోరుతున్నారు.