శ్రీకాకుళం

ప్రధాని దిష్టిబొమ్మ దగ్దం చేసేందుకు ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 21:ప్రత్యేక హోదా సాధనకై టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి కాశీబుగ్గ మూడు రోడ్లు జంక్షన్ వద్ద ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాశీబుగ్గ సి ఐ అశోక్‌కుమార్ ఆ ప్రాంతానికి చేరుకొని టీడీపీ నాయకులు ప్రయత్నాలను వమ్ము చేసారు. టీడీపీ నాయకులంతా మూడు రోడ్లు జంక్షన్ వద్ద బైఠాయించి తక్షణమే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం కపటవైఖరిని విడనాడాలని, బిజెపీ రాష్ట్ర ప్రజలపై చిన్నచూపు చూడడం తగదని నినాదాలు చేసారు. రహదారిపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడి కిలోమీటరు వరకు వాహనాలు బారులు తీరారు. ప్రధాని దిష్టిబొమ్మను నిప్పు పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తుండగా కాశీబుగ్గ పోలీసులు వారిని బలవంతంగా జీపుల్లోకి ఎక్కించి కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో యార్లగడ్డ వెంకన్నచౌదరి, శశిభూషణ్, బూర్ల రాజు, షణ్ముఖరావులతోపాటు మరో 20 మంది వున్నారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
పలాస, మార్చి 21:ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పలాస టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసమై పలాస మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం టీడీపీ తెలుగుయువత నాయకులు బూర్ల రాజు ఆధ్వర్యంలో బ్రాహ్మణతర్లా నుంచి కిష్ణుపురం, గరుడఖండిల మీదుగా కాశీబుగ్గ మూడు రోడ్లు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కిష్టుపురంలోని లచ్చన్న విగ్రహానికి బూర్ల రాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ప్రత్యేక హోదా సాధిద్దామని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఈ సందర్భంగా వెంకన్నచౌదరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం సాక్షిగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌తో రాష్ట్రాన్ని విడగొట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకువెళ్లడంలో సఫలీకృతం కావడంలో తెలుగుప్రజలు అండదండలేనన్నారు. తెలుగువారు ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశమని, ఆ పార్టీ నాయకులు ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మినేని గంగారాం, కుత్తుం లక్ష్మణ్, సుధా, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం టిడిపి ధర్నా
రాజాం, మార్చి 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ బుధవారం టిడిపి సారధ్యంలో అంబేద్కర్ జంక్షన్‌లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జి కావలి ప్రతిభాభారతి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బిజెపికి పడుతుందని, తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఆమెతో పాటు రాజాం ఎంపిపి జడ్డు ఉషారాణి, ఏ ఎంసి చైర్మన్ పైల వెంకటరమణ, టంకాల వెంకటేశం, గార గున్నంనాయుడు, గురవాన నారాయణరావు, వంగా వెంకటరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.