శ్రీకాకుళం

నేడు జాతీయ రహదారులు దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మార్చి 21: వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 22న జిల్లాలో ప్రతీ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల ద్రిగ్భందం విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిశాంతి జిల్లా ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణంపై టీడీపీ నిర్వహిస్తున్న ఎత్తుగడలకు ప్రజానీకం ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ఎన్నికల ఎత్తుగడ అని అన్నారు. అవిశ్వాస తీర్మాణంపై మీడియా దగ్గర ఓ మాట, స్పీకర్ వద్ద మరో మాట టీడీపీ చెప్తుందని ఆరోపించారు. 5కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబునాయుడు మాయమాటలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ రహదారుల ద్రిగ్భదంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యువత, విద్యార్ధులు అఖిలపక్ష నాయకులు స్వచ్ఛదంగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. పాతపట్నం నియోజకవర్గంలో ఉదయం 10గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాశీబుగ్గకు చేరుకున్న పరమాచార్య పాదుకలు
పలాస, మార్చి 21:జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన కంచి 68వ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖేరాంధ్ర, సరస్వతి మహాస్వామి వారి పాదుకాయాత్రలు కాశీబుగ్గకు బుధవారం సాయంత్రం చేరుకుంది. కాశీబుగ్గ పొలిమేరలో అయ్యప్ప దేవాలయం వద్ద మేళాతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పెద్ద ఎత్తున మహిళలు,్భక్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్తద్రారణులతో కాశీబుగ్గ రామాలయం వరకు పల్లకీసేవలో పాల్గొన్నారు. కంచి నుంచి విచ్చేసిన వేదపండితులు పరమాచార్య పాదుకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం ఇన్‌ఛార్జి జయశంకర్ నేతృత్వంలో సంప్రదాయ నృత్యాలు, అన్నమయ్య కీర్తనలు పలువురును ఆకట్టుకున్నాయి.

జనసేన కార్యకర్తలు నిరసన
పలాస, మార్చి 21:ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జనసేన కార్యకర్తలు కాశీబుగ్గలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, చేయి, చేయి కలిపి ప్రత్యేక హోదా సాధిద్దామన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు జనసేన పోరాటం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధనలో పూర్తి వైఫల్యం చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని గుర్తించి ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మహేష్, పూర్ణచంద్రరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.