శ్రీకాకుళం

పన్ను చెల్లించకపోతే భవన సముదాయాలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 23: నగరపాలక సంస్థ పరిధిలో భవన సముదాయాలకు సంబంధించి పన్ను బకాయిదారులు పన్ను చెల్లించనట్లయితే ఆ సముదాయాలను సీజ్ చేయడం జరుగుతుందని నగర కమీషనర్ శ్రీరాములనాయుడు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 17 రెవెన్యూ వార్డులకు సంబంధించి మార్చి 31లోగా ఆస్తిపన్ను బకాయిదారులు పన్నులను చెల్లించాలని కోరారు. మార్చి 2018 నాటికి వాణిజ్య సముదాయాలకు ఇంకనూ సుమారుగా రూ.300కోట్లు పన్ను బకాయిలు ఉన్నాయని ఈనెల 21నాటికి రూ.16.50లక్షలు, 22 నాటికి రూ.8.53లక్షలు, 23 నాటికి రూ.13.35లక్షలు పన్ను మొత్తంగా చెల్లించాలన్నారు. నేటి వరకు రూ.1.16కోట్లు పన్ను రూపేనా వసూలు చేసినట్లు తెలియజేశారు. ఏప్రిల్ నాటికి ఆస్తిపన్ను బకాయి ఉన్నచో అపరాదవడ్డీని విధించి ఆస్తిపన్ను వసూలు చేయబడునని తెలియజేశారు. ఆస్తిపన్ను చెల్లించి నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.