శ్రీకాకుళం

పాలకొండలో పెను విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ, ఏప్రిల్ 24: పాలకొండ పరిసర మండలాల్లో దుర్గారావు వంట మాస్టార్‌గా మంచి పేరు సంపాదించారు. వంటల్లో దిట్ట అయిన దుర్గారావుపై ఆధారపడి కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది వంట పుట్టీలు జీవిస్తున్నారు. దుర్గారావు తన వృత్తిలో భాగంగా పాలకొండకు అనుసరించి ఉన్న వీరఘట్టంలోని పనసనందివాడ గ్రామానికి ఒక వివాహ కార్యక్రమానికి వంట చేసేందుకు తన బృందంతో మంగళవారం వెళ్లారు. విధి వక్రీకరించి పిడుగురూపంలో అతనిని నందివాడ గ్రామంలోనే కబళించింది. దీంతో ఆ గ్రామస్తులు నిశే్చష్టులయ్యారు. దుర్గారావు మృతి చెందిన సమాచారం పాలకొండకు అందడంతో పట్టణంలో పెను విషాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా పరిసర గ్రామాల ప్రజలకు కూడా దుర్గారావు సుపరిచితుడు కావడంతో ఆయా గ్రామాల వారు కూడా విచారం వ్యక్తం చేశారు. ఇంటి యజమానిగా ఉన్న దుర్గారావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు జీవనాధారం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కుటుంబ యజమాని చనిపోవడంతో భార్య, పిల్లలతో పాటు కుటుంబ సభ్యులంతా బోరున విలపించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో పి ఎం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్ళి విచార వదనాలు మధ్య బంధువులు, ఇతరులు దహన సంస్కారాలు నిర్వహించారు. దుర్గారావు మృతి పట్ల పట్టణానికి చెందిన పలువురు పెద్దలు సంతాపం తెలిపారు.
ఉత్తమ పంచాయతీ సర్పంచ్‌కు పుష్కర అవార్డు
వీరఘట్టం, ఏప్రిల్ 24: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహోత్సవంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ జామి అనూరాధకు రాష్ట్ర రవాణా, బిసి శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి చేతుల మీదుగా పుష్కర అవార్డును అందించారు. ఈ సందర్భంగా ఆమెను దుశ్శాలువతో పాటు సత్కరించి సన్మాన పత్రం అందించారు. పంచాయతీలోని ఘన, వ్యర్థ పదార్థాల కేంద్రం నిర్వహణ, మరుగుదొడ్లు నిర్మాణంలో శతశాతం పూర్తి చేసినందుకు ఉత్తమ పంచాయతీగా ఏర్పడడానికి కృషి చేశారని వారు కొనియాడారు.

వీరఘట్టంలో భారీ వర్షం
వీరఘట్టం, ఏప్రిల్ 24: మండల కేంద్రం వీరఘట్టం, పరిసర గ్రామాల్లో ఉదయం 11 గంటల సమయంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లున్నీ జలమయం అయ్యాయి. పలు వివాహాలు జరిగినందున భోజన సమయంలో ఈ వర్షం పడడంతో ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షంతో వ్యవసాయానికి కొంత అనుకూలంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అరటి, జీడి పంటలకు కొంత నష్టం జరుగుతుందని రైతులు తెలిపారు.