శ్రీకాకుళం

చంద్రబాబును విమర్శించే హక్కు మీకెక్కడది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావేరు,జూన్ 17: రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతం శ్రమించే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడను, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైసీపీ నాయకులకు లేదని రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆదివారం బుడుమూరు మార్కెట్ యార్డ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలు ఎత్తుతుందని ఆ తానులోనే ముక్కే వైసీపీ అని అన్నారు. ప్రజల అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రి వర్గంలోని కొందరు మంత్రులు రాష్ట్ర విభజనకు సహకరించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనలో సమతుల్యత దెబ్బతిన్నప్పటికీ నాడు నోరు మెదపని అప్పటి మంత్రులు కొంతమంది నేడు రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న తప్పుడు విమర్శలుకు పూనుకోవడం సరికాదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మద్యంపై ఎంక్వైరీ వేయగా అందులో ఎవరి భాగస్వామ్యం వుందో ప్రజలందరికీ విదితమేనని కొందరు వైసీపీ నాయకులపై ఆయన పరోక్ష విమర్శలు చేసారు. చంద్రబాబు పై విమర్శలు చేసిన వ్యక్తికి ఉన్న స్థాయి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని ఎందరో వ్యక్తులు గుర్తించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లేమి తో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు పూనుకోవడం సాహసోపేతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని రానున్న ఎన్నికల్లో అది కచ్చితంగా రుజువవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎచ్చెర్ల,రణస్థలం మండలాధ్యక్షులు పివి రమణారెడ్డి, గొర్లె విజయకుమార్, లావేరు మండలాధ్యక్ష ప్రతినిధి మీసాల రమణ, తెలుగుదేశం యువ నాయకులు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, రాష్ట్ర హౌసింగ్‌బోర్ డైరెక్టర్ నడికుదిటి ఈశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి మురళీమోహన్, ఆర్.ప్రకాశరావు, ఆరంగి రమణబాబు, ఛార్లెస్, అజార్, సాయికుమార్, ఇనపకుర్తి తోటయ్యదొర, పిన్నింటి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.