శ్రీకాకుళం

రూ. 57 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 17: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి నదులు అనుసంధానానికి శ్రీకారం చుట్టారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఇంధన శాఖామంత్రి కిమిడి కళావెంకటరావు స్పష్టం చేశారు. ఆదివారం దోమాం, కుశాలపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల అభ్యున్నతికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమ లు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని దీనికి చంద్రబాబు పాలనే కారణమని స్పష్టం చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ లింకు రోడ్‌ల నిర్మాణానికి 467 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని వివరించారు. 14 వేల కిలోమీటర్ల పొడవున సిమ్మెంటు రోడ్లు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని సిమ్మెంటు రోడ్లు రాష్టమ్రంతటా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులకు పింఛన్లు డ్వాక్రా సంఘాలకు రుణాలు, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న భీమా వంటి పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. ఇటువంటి పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి చంద్రబాబు నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బలపరిచేలా పార్టీ శ్రేణులు కృషిచేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగుదేశం పార్టీ నిద్రపోదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, అటువంటి వ్యక్తులకు అధికారం ఇస్తే రాష్ట్ర ఆధోగతిపాలవుతుందని ఆరోపించారు. బిజెపి, వైసిపి కుమ్మక్కు రాజకీయాలు నెరుపుతున్నాయని విమర్శించారు. పెద్ద కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ పుట్టిందని ఈ రెండు పార్టీల నుంచే వచ్చిన జగన్మోహన్‌రెడ్డి, బొత్స సత్తిబాబులు కొత్తనేతలు కాదని వీరి అవినీతి రాష్ట్ర ప్రజలకు తెలుసని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సి ఎం చంద్రబాబు అభివృద్ధి చేశారని ఈ కార్యక్రమాలను ప్రజల ముంగిటికి తీసుకువెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబును చేస్తే మరింత అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. దోమాం గ్రామంలో అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలతోపాటు పాఠశాల అదనపు భవనాలను ప్రారంభించారు. అలాగే కుశాలపురంలో నిర్మించిన సిమ్మెంటు రోడ్డును మంత్రి కళా, జడ్మి చైర్‌పర్సన్ ధనలక్ష్మిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో టిడిపి శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జిల్లా పూర్వపు అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, కళా తనయుడు రామ్ మల్లిక్ నాయుడు, బెండు మల్లేశ్వరరావు, వావులపల్లి రామకృష్ణ, అనె్నపు భువనేశ్వరరావు, బచ్చు కోటిరెడ్డి, పైడి అన్నంనాయుడు, పైడి గోవిందరావు, జీరు రామారావు, గాలి వెంకటరెడ్డి, బోర సాయిరాం, బోర వెంకటరావు, పొందూరు భీమారావు, సీపాన ఎర్రన్నాయుడు, గాడు రామారావు, గట్టిం శివరామ్, ఎంపిడివో ఆర్.వెంకటరావు తదితరులు ఉన్నారు.