శ్రీకాకుళం

ఆర్టీసీ రేట్లు...అదిరిపోయాయి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఇళాకలో ఆర్టీసీ ఛార్జీల బాదుడుపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీజల్‌రేట్లు పెరిగినా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదంటూ పలు వేదికల నుంచి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉదరగొట్టిన ప్రసంగాలన్నీ ఊకదంపుడే అంటూ ఆ సంస్థ ఎం.డి. సురేంద్రబాబు రాత్రికిరాత్రి ఉత్తర్వులు జారీ చేస్తూ నిరూపించారు. రాష్టమ్రంతటా ఆర్టీసీ బస్సుల ఛార్జీల మోత ఏలా ఉన్నా...శ్రీకాకుళం జిల్లా మంత్రిగా రవాణాశాఖ మంత్రి అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. ‘చిల్లర’సమస్యలంటూ చెప్పే ఆర్టీసీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగే దారిద్య్రరేఖకు దిగువనున్న, మధ్యతరగతి ప్రజలు జిల్లా మంత్రి అచ్చెన్న పేరునే ప్రస్తావనలోకి తీసుకువస్తూ బస్సుల్లో జగడం చేస్తున్నారు. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అంతా ఆర్టీసీ బస్సు ఛార్జీల బాదుడుపై సాంకేతికపరమైన, ఆర్థికపరమైన సర్దుబాట్లు అన్న ఆలోచనలు లేకుండా విచక్షతను విస్మరించి మంత్రి అచ్చెనే్న ప్రయాణీకులపై ఛార్జీల భారం నెట్టేసారంటూ ఆరోపిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు శ్రీకాకుళం నుంచి బయలుదేరే ప్రతీ ఎర్రబస్సులోనూ శుక్రవారం కన్పించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జిల్లా ప్రజల నుంచి రోజుకు రూ. 16.2 లక్షల రూపాయలు ‘చిల్లర’కథ చెప్పి బాదుడు ప్రారంభించేసింది. జిల్లాలో గల శ్రీకాకుళం-1, 2 డిపోలతోపాటు పాలకొండ, టెక్కలి, పలాస డిపోల పరిధిలో గల 435 బస్సుల్లో 435 సర్వీసులకు ఈ పెరిగే రేట్లు వర్తిస్తాయి. రోజుకి సుమారు రూ. 40 - 45 లక్షల ఆదాయం వచ్చే జిల్లా ఆర్టీసీకి ఈ చిల్లర రౌండప్ బాదుడుతో రూ. 52 - 58 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉందంటూ ఆర్థిక నిపుణులు విశే్లషణ చేస్తున్నారు. బస్సులన్నీంటికీ 21వ తేదీ అర్థరాత్రి నుంచే ముందస్తుగా ప్రజలకు కనీస సమాచారం లేకుండా సామాన్య, మధ్యతరగతి వర్గాలపై ఛార్జీల భారం పెంచేసింది. ఆర్టీసీ ఛార్జీల పెంపు గురించి గతంలోలాగా ప్రయాణీకుల్లో ముందస్తుగా ప్రచారం కల్పించకుండా ఒక్కసారిగా పెంచిన బస్సు ఛార్జీలను అమలు చేయడం రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇళాకలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇలా హఠాత్తుగా టిక్కెట్ల ధర పెంచడం వల్ల ప్రయాణికులు, కండక్టర్లు మధ్య ఘర్షణలు శుక్రవారం రోజున చోటుచేసుకున్నాయి. గతంలో ఛార్జీల్లో సవరణలు చేసినప్పుడు బస్సులపై పోస్టర్లు అంటించి ప్రచారం నిర్వహించి మానసిక, ఆర్థికంగా సామాన్యులను చైతన్యపరిచే ఆర్టీసీ ఈసారి పూర్తిగా ప్రజలపై బాదుడుకు సిద్ధమైపోయింది. దీనికి చిల్లర సమస్యే కారణమంటూ ఆ సంస్థ అధికారులు, మంత్రి చెప్పే పిట్టకథలు! రాత్రికిరాత్రే భారీగా ఛార్జీలను పెంచడం వల్ల ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియోపై పెను ప్రభావం పడుతుందని ఆర్టీసీ యూనియన్ నాయకులు విశే్లషిస్తున్నారు. డీజల్ ధరల పెంపు వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతున్నా బస్ ఛార్జీలని పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెట్టబోమని ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం కొన్ని రోజులకే తమ ప్రకటనకు తిలోదకాలు ఇస్తూ చిల్లర సమస్య పేరుతో ఛార్జీలను పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన ఛార్జీల పెంపు చిల్లర సమస్య సర్దుబాటుకు చేసినట్టు కన్పించడం లేదు. ఒక ఊరు నుంచి మరో ఊరుకు రూ. 11, రూ. 21, రూ. 31 ఛార్జీలు ఉన్నట్లయితే ఆ టిక్కెట్ల ధర ఆ తర్వాత స్థానం రౌండ్ ఫిగర్ అంటే వరుసగా రూ. 15, రూ. 25, రూ. 35కు పెంచడమని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. అదే టిక్కెట్ ధర రూ. 16, రూ. 26, రూ. 36 ఉన్నట్లయితే వారి ఛార్జీలు రూ. 20, రూ. 30, రూ. 40కు పెరుగుతాయి. అలాగే వెనె్నల సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలను తర్వాత ఛార్జీ పది రూపాయలకి రౌండప్ చేస్తున్నట్లు ఆర్టీసీ ఎం.డి. సురేంద్రబాబు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.