శ్రీకాకుళం

జోరు వాన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 19: బంగాళఖాతంలో ఏర్పడిన రోను తుపాను ఒడిశా తీరం వెంబడి పయనిస్తుందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ఒడిశాకు ఆనుకునివున్న శ్రీకాకుళం జిల్లాలో హై అలర్ట్‌గా ప్రకటించారు. ఒడిశాలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి కురిసే పరిస్థితులు ఉండడంతో పక్కనే గల శ్రీకాకుళంపై తుపాను తడాకా గత 36 గంటల నుంచి చూపిస్తుంది. తీరం వెంబడి అధికవేగంతో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యుత్, కమ్యూనికేషన్ల వ్యవస్థ అక్కడక్కడ దెబ్బతిన్నాయి. తీరప్రాంత జిల్లాయైన శ్రీకాకుళం కలెక్టర్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్షించారు. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యర్శి ఎస్పీ టక్కర్ కూడా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వం కూడా రోనో తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. ఇందులోభాగంగానే గురువారం కలెక్టర్‌తో ఒడిశా అధికారులు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో ఒడిశా గ్రామాల పట్ల జిల్లా కలెక్టర్ చేస్తున్న సహాయచర్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో భౌగోళిక హద్దులతో సంబంధం లేకుండా గల 14 గ్రామాల ప్రజలకు ఆహారం, తాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌ను ఒడిశా ప్రభుత్వం కోరింది. రోనూ ఎనిమిది కిలోమీటర్లు వేగంతో ఒడిశా వైపు పయనిస్తుందని, శుక్రవారానికి ఆంధ్ర - ఒడిశా తీరంలో మరింత బలపడుతున్నట్లు ఒడిశా అధికారులు జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. దీని ప్రభావంతో గోపాల్‌పూర్, గంజాం, గజపతి, ఛత్రపూర్, పూరి, పరాదీప్‌లతోపాటు, శ్రీకాకుళం జిల్లాను ఇరుగుపొరుగు కలెక్టర్లు అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆరు గంటల్లో 7.8 సెంటీమీటర్లు వర్షం కురిసింది. రోనో తుపాను జిల్లాలో తన తఢాకా చూపిస్తోంది! వేకువఝాము నుంచి కురుస్తున్న వర్షం మొత్తం 10.64 సెంటీమీటర్లు. అత్యధికంగా శ్రీకాకుళం నగరంలో కురియగా, ఎచ్చెర్లలో 6.08 సె.మీ., లావేరులో 5.2 సె.మీ., అత్యల్పంగా భామినిలో 7.8 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఒడిశా తీరాన్ని ఆనుకుని పయనానికి పరుగులు తీసుకున్న రోను గురువారం రాత్రికి తీవ్రరూపం దాల్చి శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ చేసిన హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం 38 మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు నియమించి తుపాను గమనాన్ని దృష్టిలో పెట్టుకుని బృందాలు ఏర్పాటు చేసారు. కళింగపట్నం తీరంలో రెండో ప్రమాదహెచ్చరికలు జారీ చేసారు. అతి భారీగా వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రానున్న 48 గంటల్లో తీవ్రరూపం దాల్చే రోనో తుపాను వల్ల 80 - 100 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా రెవెన్యూ సిబ్బంది గురువార ఉదయానికే ఆ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు చేరారు. రెవెన్యూ, ఫైర్ శాఖలతోపాటు అన్నీ శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలంటూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. గురువారం రాత్రి తుపాను నుంచి రక్షణ చర్యల కోసం ఎన్.ఆర్.డి.ఎఫ్. బృందాలు కూడా జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.

అప్రమత్తంగా ఉండండి
* ప్రతీ మండలంలో కంట్రోల్ రూంలు
* ప్రత్యేక అధికారులు నియామకం
* కలెక్టర్ డాక్టర్ లక్ష్మీనృసింహం
శ్రీకాకుళం, మే 19: రోను తుపాను ప్రభావంపై గ్రామల నుంచి తక్షణ సమాచారం జిల్లా కేంద్రానికి అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులను ఆదేశించారు. రోను తుపానుపై గురువారం ఆయన మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఎటువంటి అనుచిత సంఘటనలనైనా తక్షణం జిల్లా కేంద్రానికి అందంచాలని ఆదేశించారు. ఇందుకు సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు లేదా పోలీసు వైర్‌లస్ సెట్లను వినియోగించాలని సూచించారు. తుపానుపై ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, మానవ ప్రాణహానీ లేదా పశుప్రాణ సానీ తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 48 గంటల వరకు తుపాను హెచ్చరిక ఉన్నందున 21వ తేదీ ఉదయం వరకు మండల కేంద్రాలలోనే ప్రత్యేక అధికారులు ఉండాలని హుకుం జారీ చేశారు. మండలాల్లో తుపాను రక్షిత భవనాలు లేదా పునరావాస కేంద్రాలను పరిశీలించాలని, ప్రమాదకరంగా ఉండే రహదారులు, కాలువలు, వంతెనలు తదితర వాటిని పరిశీలించాలని అన్నారు. ఇప్పటికే ఉన్న కాలువ, చెరువులు తదితర గండ్లను పూడ్చాలని సూచించారు. రేషన్ దుకాణాల్లో ఆహార సరుకుల నిల్వలను పరిశీలించి వాటిని అవసరమైతే వినియోగించుటకు సిద్ధం చేయాలని పసి పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అవసరం మేరకు పాలు, ఆహార పదార్థాలు సిద్ధం చేసి అందించాలని ఆదేవించారు. పెట్రోల్ మంకుల్లో కనీసం 3 వేల లీటర్లు తుపాను సంబంధిత ప్రభుత్వ వాహనాలకు ఇతర అవసరాలకు వినియోగించుటకు తగు ఆదేశాలు జారీ చేసి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి, విఆర్వో తదితరులలో మాధ్యతాతమైన బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ కూలీలు పనులు చేసే అవకాశాలను తనిఖీ చేయాలని అందుకు తగిన సూచనలు జారీ చేయాలని అన్నారు. నీట మునిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వైద్యఆరోగ్యశాఖ, పశుసంవర్థకశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీ, ఆర్ డ్ బి, జలవనరుల శాఖ, అటవీశాఖ, ట్రాన్స్‌కో అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలని ఎక్కడ అనుకూల పరిస్థితులు సంభవిస్తే తగు చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అవసరమగు బ్లీచింగ్, మందులు సిద్ధం ఉంచాలని ఆయన ఆదేవించారు.
38 మండలాల్లో కంట్రోల్ రూంలు
రోనో తుపాను దృష్ట్యా జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజనల్ కేంధ్రాలతో సహా 38 మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసామని వీడియోకాన్ఫరెన్స్ అనంతరం మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ వివరించారు. జిల్లాలో గరువారం గాలులు, విస్తారంగా వానలు పడుతుందని తుపాను హెచ్చరిక కేంద్రం సూచించిందని చెప్పారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగాన్ని పూర్తి అప్రమత్తం చేశామని తెలిపారు. గురువారం ఉదయం వరకూ శ్రీకాకుళం నగరంలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యిందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచించారు. మత్స్యశాఖ అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆగూరు, కంచరాం గ్రామాల్లో అతిసార ప్రభలే అవకాశాలు ఉన్నట్లు సమాచారం వస్తుందని ఆ గ్రామాలపై దృష్టి సారించి వైద్య సిబ్బందిని తక్షణం పంపించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి ఆదేవించినట్లు చెప్పారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్వో కృష్ణ్భారతి, సిపివో శివరామ్‌నాయకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్.ఇ. శ్రీనివాసరావు, భూగర్భజలాలశాఖ ఉపసంచాలకులు ప్రసాదరావు, జిల్లా సహకార అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

గాలులు తీవ్రం!
* ఎగిసిపడుతున్న అలలు
* బిక్కుబిక్కుమంటున్న తీరప్రాంత వాసులు
* ఒడ్డుకు చేరిన 200 పడవలు
* 400 కుటుంబాలు పస్తులు
ఎచ్చెర్ల, మే 19: తుపాను ప్రభావం వలన గాలులు తీవ్రరూపందాల్చడంతో తీర ప్రాంత వాసులంతా బిక్కుబిక్కుమని ఇళ్లల్లో గడుపుతున్నారు. సముద్రం అలలు ఎగిసిపడటమే కాకుండా పలు చోట్ల ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు స్పష్టంచేస్తున్నారు. మండలంలోని బుడగట్లపాలెం, బడివానిపేట, మూసవానిపేట, గిన్నివానిపేట, జాలారి కొయ్యాం, డి.మత్స్యలేశం, కొత్తదిబ్బలపాలెం, రాళ్లపేట, శివాజీ దిబ్బలపాలెం, పాత దిబ్బలపాలెం గ్రామాలకు చెందిన అనేక మంది మత్స్యకారులు కర్రపడవలతో వేట సాగిస్తుంటారు. వీరు గత రెండు రోజులుగా నిషేధం విధించడంతో 200 పడవలు ఒడ్డున పడి ఉన్నాయి. సుమారు 400 కుటుంబాలు ఉపాధి లేక పస్తులుండాల్సిన పరిస్థితి తీర గ్రామాల్లో నెలకొంది. హుదూద్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గంగపుత్రులను వాయుగుండం హడలెత్తిస్తుంది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వేటకు వెళ్లవద్దంటూ తహశీల్దార్ బందరు వెంకటరావు ఈ గ్రామాల్లో గురువారం పర్యటించి స్థానిక విఆర్‌వోలను తీరగ్రామాల్లో మకాంవేయాలని ఆదేశాలు జారీ చేశారు. పునరావాస చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు. ఈయనతోపాటు ఆర్‌ఐ వెంకటేష్, మండల సర్వేయర్లు రాజగోపాల్, గణపతి, విఆర్‌వోలు శ్రీనివాసరావు, గోవిందరావు, వాసు, శ్రీనివాసరావు, అరుణకుమార్ తదితరులు ఉన్నారు. తీర గ్రామాల్లో తాజాసమాచారాన్ని ఎప్పటికప్పుడు కలెక్టరేట్ కంట్రోమ్‌రూమ్‌కు చేరవేయడమే కాకుండా మత్స్యకార గ్రామాల్లో పౌరులు అధికారులకు సమాచారం అందించేలా తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాల్లో పరిస్థితులను అధికారుల ద్వారా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీలు అడిగి తెలుసుకుని సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

విద్యుత్ కంట్రోల్‌రూంల ఏర్పాటు
శ్రీకాకుళం(టౌన్), మే 19: జిల్లాలో రోను తుపాను పరిస్థితుల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులకుఎటువంటి విద్యు త్ సమస్య ఎదురైనా ఫిర్యాదు చేయడానికి గాను తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కంట్రోల్‌రూంలను ఏర్పాటుచేసారు. ఈ మేరకు ఇపిడిసియల్ పర్యవేక్షక ఇంజనీరు జి.శరత్‌కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం నెం. 08942- 227361, 9490612633, డివిజనల్ కార్యాలయం 08942- 222361, టెక్కలి డివిజనల్ కార్యాలయం 08945-244210 కేటాయిస్తూ పరిసరాల్లో విద్యుత్ సమస్యలపై ఫోన్‌చేయాలన్నారు.

తుపానుపై అప్రమత్తం చేస్తున్న నేతలు
శ్రీకాకుళం, మే 19: రోను తుపానుపై జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుపాను దృష్ట్యా రాష్ట్ర మంత్రులు అందరూ జిల్లాలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మంత్రి అచ్చెన్న హుటాహుటిన గురువారం జిల్లాకు చేరుకున్నారు. జిల్లాకు చేరుకున్న వెంటనే కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్పీ బ్రహ్మారెడ్డితో ఫోన్‌లో సమీక్షించారు. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచేయాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను భేరీజువేయాలని, సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణహాని జరగకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను ఉద్ధృతం అయితే తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించుటకు తగు వాహనాలను సిద్ధం చేయాలన్నారు. పసిపిల్లలకు పాలతో సహా పునరావాస కేంద్రాలలో ఆహార ఏర్పాట్లు, తాగునీరు అందించాలని ఆదేశించారు. పూరిగుడిసెలు, మట్టి ఇళ్ళల్లో నివసించే వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితులు ఉంటే ముందుగా గుర్తించి వాటితో ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. చెరువులు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వెళ్ళకుండా జలవనరులశాఖ, ఉపాధి హామీ సిబ్బంది చర్యలు చేపట్టాలని అన్నారు. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ళరాదని ఆయన కోరారు. ఇప్పటికే ఎవరైనా వెళ్ళి ఉంటే అటువంటివారి వివరాలు సేకరించాలని మంత్రి అచ్చెన్న మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్!
* ఎంపీ రామ్మోహన్‌నాయుడు కలెక్టర్‌తో సమాలోచనలు
శ్రీకాకుళం, మే 19: తీవ్రరూపం దాల్చనున్న రోనూ శ్రీకాకుళం జిల్లాపై ప్రభావితం చూపితే ఎటువంటి చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్న అంశాలపై శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంలు సమాలోచనలు చేస్తున్నారు. గురువారం రాత్రి ఎం.పి. కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తుపానుపై ముందస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైతే ఎన్.ఆర్.డి.ఎఫ్. బృందాలను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఎం.పి. రామ్మోహన్‌నాయుడు కలెక్టర్‌కు సుస్పష్టం చేసారు. అలాగే, జిల్లాలో అన్నీ మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, తెలుగుయువత పనిచేసేందుకు సిద్ధం చేసామని, అవసరాన్ని బట్టీ వారిని కోరితే పంపగలమని కలెక్టర్‌కు ఎం.పి. పేర్కొన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో కురిసిన అత్యధిక వర్షపాతంతోపాటు, సముద్రతీరంలో గల మత్స్యకారుల గ్రామాలకు మరింత అప్రమత్తం చేయాలని ఎం.పి. సూచించారు. శ్రీసదన్‌లో రౌండ్ ది క్లాక్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రాణ నష్టం కలుగకుండా చర్యలు తీసుకునేందుకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని కలెక్టర్‌కు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలో వ్యక్తిగా కాకుండా, మానవతా దృక్పథంతో తుపాను సమర్థవంతంగా అడ్డుకునేందుకు తన సైన్యం ఉందన్నారు.

23 నుంచి పాలిటెక్నిక్
ప్రవేశ సర్ట్ఫికెట్ల పరిశీలన
ఎచ్చెర్ల, మే 19: పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పోలీసెట్‌కు హాజరైన వారంతా వారివారి ర్యాంకుల ప్రాప్తికి ఈనెల 23నుండి 29వరకు స్థానిక ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల కౌన్సిల్ హాల్‌లో సర్ట్ఫికేట్‌ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని ప్రిన్సిపల్ విఎస్ దత్తుస్పష్టం చేశారు. 23న 15వేల లోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థులు సర్ట్ఫికెట్‌లను పరిశీలించనున్నట్లు తెలిపారు. 24న 30వేలు, 25న 45వేలు, 26న 60వేలు, 27న 75వేలు, 28న 90వేలు, 29న 91వేలు నుండి చివరి ర్యాంకు వరకు అభ్యర్థుల సర్ట్ఫికెట్‌లను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. 25నుంచి 30వరకు వెబ్ ఆప్షన్ అభ్యర్థులు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నెల 23న ఎన్‌సిసి, క్యాప్, పిహెచ్‌సి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అర్హతలు ఉన్న అభ్యర్థుల సర్ట్ఫికేట్ పరిశీలన విజయవాడ బెంజ్‌సర్కిల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.250 సర్ట్ఫికెట్ పరిశీలనకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఎస్ ఎస్ సి మార్కుల జాబితా 4నుండి 10వతరగతి స్టడి, బదిలీ సర్ట్ఫికెట్‌తోపాటు కుల, ఆధాయ ధృవపత్రాలు వెంటతీసుకురావాలన్నారు. ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు మూడుసెట్లు జిరాక్స్ ప్రతులతో ఈ పరిశీలనకు హాజరు కావాలని సూచించారు.జూన్ 2న సీట్లు కేటాయింపు, 8నుండి తరగతుల నిర్వహణ చేపడతామని ప్రిన్సిపల్ విఎస్ దత్తు వివరించారు. ఈయనతోపాటు విభాగాధిపతి మేజర్ కె.శివకుమార్‌లు ఉన్నారు.

యాజమాన్యం పక్షపాత వైఖరి విడనాడాలి
* ఆర్టీసీ కార్మిక పరిషత్ జోనల్ అధ్యక్షుడు రాధాకృష్ణ
శ్రీకాకుళం(టౌన్), మే 19: ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల పట్ల పక్షపాత వైఖరిని విడనాడాలని ఎపియస్ ఆర్టీసీ కార్మిక పరిషత్ జోనల్ అధ్యక్షులు పప్పల రాధాకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు స్థానిక ఓ హోటల్‌లో నిర్వహించిన జోనల్ కార్యవర్గ సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి బి.యల్.పి.రావు పాల్గొని మాట్లాడారు. రీజియన్‌లో 281 చార్టుల వద్ద కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వారు ధ్వజమెత్తారు. సంస్థ అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి కృషిచేస్తున్న యూనియన్‌గా కార్మికపరిషత్ కార్మికులకు పట్ల ప్రదర్శిస్తున్న యాజమాన్య పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామన్నారు. దీనిని సరిదిద్దకుంటే భవిష్యత్‌లో కార్మిక వ్యతిరేకతకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. అనంతరం రీజియన్ కమిటీ మార్చాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్.శిమ్మయ్య, జి.ఆర్. బాబు, రీజనల్ కార్యదర్శి ఎం.నానాజీ, పాలకొండ, విజయనగరం, ఒకటి, రెండు డిపోల కార్యదర్శులు డి.దుర్గారావు, దుర్గరాజు, కె.యస్.రావు, బి. రామకృష్ణ, ఒకటి, రెండు డిపోల అధ్యక్షులు వి.ఎ.వి.రావు, చిట్టికృష్ణ పాల్గొన్నారు.