శ్రీకాకుళం

గ్రామదర్శినితోనే ప్రజాసమస్యలు పరిష్కారం: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, ఆగస్టు 10:ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామదర్శిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ప్రజాసమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి అన్నారు. మండలంలోని చీపి గిరిజన గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులోకి ఉండి జవాబుదారీతనంగా పనిచేయాలన్నారు. జిల్లాలో 3600 మంది గిరిజన రైతులకు పోడువ్యవసాయం చేసేందుకు పట్టాలు అందజేసామన్నారు. పుట్టూరు గిరిజన గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి, చీపి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక పద్దతుల్లో పోడువ్యవసాయానికి గిరిజన రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. గిరిజనులకు రాయితీపై గడ్డి విత్తనాలను అందజేసారు. ఇళ్లు బిల్లు బకాయిలు చెల్లించలేదని గిరిజనులు ఫిర్యాదు చేయడంతో గృహనిర్మాణ శాఖ అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమీక్షించారు. ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేసి రోగులకు సేవలు అందించినప్పుడు ప్రజల మన్ననలు పొందుతారని జిల్లా కలెక్టర్ అన్నారు. హరిపురం సిహెచ్‌సీ ఆసుపత్రిని శుక్రవారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వార్డులు, మందులస్టాక్ వివరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను తెలుసుకున్నారు. 24 గంటలు ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్యసేవలు అందించారు. ఆసుపత్రిలో ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాయని స్ర్తి వైద్యనిపుణులు జి.రోజారాణిని ప్రశ్నించారు. సమాధానం సంతృప్తిగా లేకపోవడంతో వైద్యవృత్తిని మాని ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుకోవాలన్నారు. వైద్యులకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తుందని, తీసుకున్న జీతానికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వరరావు, తహసీల్థార్ శ్యాంసుందరరావు, ఏవో పోలారావు, ఎం ఇవో శ్రీనివాసరావు, లలిత తదితరులు పాల్గొన్నారు.

రొట్టవలసలో స్వచ్ఛ్భారత్
సరుబుజ్జిలి, ఆగస్టు 10: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత పఖవాడా కార్యక్రమాన్ని శుక్రవారం రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో ఆమదాలవలవలస ఎన్‌వైసీ బ్లాక్ సారధ్యంలో పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయిని ధనలక్ష్మీ మాట్లాడుతూ పాఠశాలలతో పాటు మనం నివసించే పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. విద్యార్థులంతా పరిసరాలు పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ నాయకుల విగ్రహాలను శుభ్రపరిచి పూలమాలలను వేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైసీ రౌతు సుమతీమోహన్‌రావు, ఉపాధ్యాయులు మందపల్లి రామకృష్ణారావు, గోవిందరావు, సూర్యనారాయణ, శారద, పుష్పలతాసింగ్, సైలాదీప్తి, కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నాటుసారాను అరికడదాం
భామిని, ఆగస్టు 10: నాటుసారాను అరికడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారి ఎల్.శివశంకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన భామినిలో గిరిజన, దళిత, శొండి కులస్తులతో నిర్వహించిన నవోదయ కార్యక్రమానికి పీవో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా అమ్మకాలు మానుకోవాలని సూచించారు. సారా తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించి ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. బతుకు తెరువు కోసం నాటుసారాను తయారుచేయడం, విక్రయించడం మానుకుంటే ప్రభుత్వం తరుపున రుణాలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీవోతో పాటు ఎంపీడీవో తేజారతన్, కొత్తూరు ఎక్సైజ్ సీ ఐలు కిరణ్‌మణీశ్వరి, కె.సునీల్‌కుమార్, ఎస్ ఐలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
భామిని, ఆగస్టు 10: ప్రభుత్వ పథకాలను సద్వనియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి ఎల్.రామారావు అన్నారు. శుక్రవారం మండలంలోని బత్తిలి పంచాయతీలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లును తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబం నిర్మించుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఎంతగానో దోహదపడుతుందన్నారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాకతేజారతన్, సర్పంచ్ టింగ అన్నాజీరావు, బత్తిలి పీ ఏసీ ఎస్ అధ్యక్షులు రాజేంద్రసాహు, వైస్ ఎంపీపీ రామకృష్ణ, డీటీ స్వర్ణలత తదితరులున్నారు.

గ్రామదర్శినితోనే సమస్యలన్నీ పరిష్కారం
మాజీ ఎమ్మెల్సీ ప్రతిభాభారతి
రాజాం, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా గ్రామదర్శిని కార్యక్రమాన్ని సమస్యల పరిష్కారానికి చేపట్టిందని మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి అన్నారు. శుక్రవారం నగర పంచాయతీలోని బుచ్చింపేట గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శినిలో పాల్గొని మాట్లాడారు. మండల స్థాయి అధికారులంతా ప్రజా సమస్యల పరిష్కారానికి దీనిని వేదికగా చేసుకొని ప్రజలతో మమేకమవుతున్నారని, చిన్న చిన్న సమస్యలతో పాటు సుదీర్ఘంగా పరిష్కారం కాని సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కారం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గ్రీష్మాప్రసాద్, కమిషనర్ సత్యనారాయణ, ఎ ఇ సురేష్, ఎస్ ఐ మురళీ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని బొద్దాం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు సారధ్యంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి వారంలో రెండు రోజుల పాటు గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఆయనతో పాటు తహశీల్దార్ వై.శ్రీనివాసరావు, ఏవో బి.రవికుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.