శ్రీకాకుళం

సైలాడలోకమ్యూనిటీ హాళ్లు నిర్మాణానికి ప్రతిపాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, ఆగస్టు 10: పంచాయతీ ప్రజలు కోరిక మేరకు కమ్యూనిటీ హాళ్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని స్థానిక నోడల్ అధికారిణి పంచాది రాధ అన్నారు. మండలంలో గల సైలాడ గ్రామంలో మాజీ సర్పంచ్ జోగి చంద్రశేఖర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో జీటీరోడ్లు, కాల్వలు, తాగునీటి పథకాలు, తాగునీటి అభివృద్ధి, పెన్షన్‌లు, పాఠశాల భవనాలు, మరుగుదొట్లు వంటివి శతశాతం నిర్మాణం చేపట్టినట్లు ఆమె వివరించారు. ఈ సమావేశంలో జోగి చంద్రశేఖర్ మాట్లాడుతూ పంచాయతీ ప్రజలు కోరిక మేరకు గ్రామంలో పాడుబడిన పురాతన కమ్యూనిటీ హాళ్లు స్థానంలో కనీసం రూ.10లక్షల వ్యయంతో కొత్తగా భవన నిర్మాణానికి నిధులు మంజూరుకై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హబీబ్, ఏవో ఉషా, హౌసింగ్ డీ ఈ రంగారావు, ఎంఈవో చంద్రశేఖర్, గ్రామనాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
* ఎమ్మెల్యే రమణమూర్తి
పోలాకి, ఆగస్టు 10: మండలంలో గల తలసముద్రం గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించినట్లు ప్రత్యేకాధికారి డాక్టర్ హేమలత తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఎం నారాచంద్రబాబునాయుడు ఆదేశానుసారం ప్రతీ గ్రామ పంచాయతీల్లో వారానికి రెండురోజులు గురు,శుక్రవారాల్లో గ్రామదర్శిని కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకందించడమే కాకుండా గత ప్రభుత్వాలు అందించిన వాటికంటే టీడీపీ పాలనలో ఏ ఏ పథకాల ద్వారా ప్రజలు లబ్ధిపొందారో అందులో వాటిపట్ల అవగాహన కల్పించడమే గ్రామదర్శిని లక్ష్యమని ఆయన అన్నారు. అలాగే తహశీల్దార్ జెన్ని రామారావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరైతు భూ దస్త్రాలు ఈ గ్రామ సభ ద్వారా సరిచేసుకోవాలని ఆయన అన్నారు. భూమి వివరాలు గతంలో కాకుండా భూ ఆధార్ పద్ధతిని పాటించి వాటిని అంతర్జాలంలో నమోదు చేసుకొని కార్డులను పొందవచ్చని ఆయన అన్నారు. ఇంటివద్ద నుండే భూమి వివరాలను అంతర్జాలంలో చూసుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించందని ఆయన అన్నారు. అనంతరం ఎంపీడీవో అలివేలుమంగమ్మ మాట్లాడుతూ ఈ సభలో గ్రామాల్లోనున్న ఏ శాఖకు సంబంధించిన సమస్యలున్నా వాటిని నిర్భయంగా ఈ సభలో తెలియపర్చాలని ఆయన అన్నారు. వచ్చిన సమస్యలను ఆయా శాఖా అధికారులతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసీ చైర్మన్ బైరి భాస్కరరావు, ఏపీఎం శ్రీనివాసబాబా, వంశధార జేఈ తిలక్ తోపాటు విద్యా,ఎలక్రికల్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, వీ ఆర్వో జగన్నాథం, ఏవో వెంకటరావు, మాజీ సర్పంచ్ యాగాటి శ్రీరాములు, ఉపసర్పంచ్ ప్రగఢ సూరిబాబు, సెక్రటరీ ఫల్ఘుణరావు, జల్లురామారావు, రాంబాబు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
* విప్ రవికుమార్
ఆమదాలవలస, ఆగస్టు 10: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథాకాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో 2 వవార్డు క్రిష్ణాపురం గ్రామం వద్ద నిర్వహించిన వార్డు దర్శిని కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ క్రిష్ణాపురం రెవెన్యూ విలేజ్ అధిక శాతం ఈ పట్టణానికి ఆనుకొని వుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ వార్డుకు అన్ని వౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ వార్డు ప్రజలు కోరికమేరకు అలికాం-బత్తిలి రోడ్డునుండి క్రిష్ణాపురం గ్రామ పురవీధుల మీదుగా పొలిమేరవరకు సుమారు రూ.10లక్షల వ్యయంతో సీసీరోడ్లపనులకు వార్డుదర్శిని కార్యక్రమంలో శంకుస్థాపన చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఎన్టీ ఆర్ బరోసా, చంద్రన్న బీమా, రైతు రుణపథకం, డ్వాక్రా మాఫీ, కోటా బియ్యం పెంపు, ఎన్టీ ఆర్ వైద్యసేవ వంటి పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, కమీషనర్ జి. శ్రావణ్‌కుమార్, దేశం నాయకులు తమ్మినేని విద్యాసాగర్, వార్డు కౌన్సిలర్ కూన రాజ్యలక్ష్మి, కూన భానోజీ , బోర గోవిందరావు, కూన అప్పలనాయుడు, సంజీవనాయుడు, బాలక్రిష్ణ, కాంట్రాక్టర్ బగాది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.