శ్రీకాకుళం

పంద్రాగస్టుకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్)/బలగ, ఆగస్టు 14 : రాష్టస్ధ్రాయి పండుగగా నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రం సిద్ధమైంది. గత ఇరవై రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీకాకుళం నగరంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వేడుకలకు వేదికైన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం అన్ని హంగులతో తీర్చిదిద్దడంలో అధికార యంత్రాంగం సఫలమైంది. నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ప్రధాన రహదారులు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. మైదానంలోని పెరేడు, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇటీవల కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమానికి సంబంధించిన మువ్వనె్నల బెలూన్‌లు మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభ ప్రాంగణాన్ని కూడా త్రివర్ణాల మిళితంగా పూలతో ఎంతో శోభాయమానంగా అలంకరించారు. ఆహ్వానితులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే వారు కూర్చునేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. నగరంలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయం విద్యుత్ దీపకాంతులతో నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దింది. అంతేకాకుండా చెట్లకు కూడా రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణలు పట్టణానికి వింత శోభను తెచ్చిపెట్టాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అందరూ చూసేందుకు వీలుగా మైదానంలోనే కాకుండా నగరంలోని పలు కూడల్లలో బిగ్ ఎల్ ఇ డి స్క్రీన్‌లు కూడా ఏర్పాటు చేసారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర డిజిపి ఆర్ పి ఠాకూర్ పరిశీలించారు. నగరంలో గల ట్రాఫిక్ ఏర్పాట్లను వి ఐపిల వాహనాల పార్కింగ్ వివరాలను డిజిపికి ఎస్పి సీ ఎం త్రివిక్రమవర్మ వివరించారు. ముఖ్యమంత్రి జెండా వందన అనంతరం అతిధులకు అందజేసే హైటీకి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలతో జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోయి నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది.
అభివృద్ధి అజెండా
పలాస, ఆగస్టు 14:అభివృద్ధి తన అజెండా అని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. మంగళవారం 12వ వార్డు ఇందిరాకాలనీలో 2 లక్షల రూపాయల సాధారణ నిధులతో పవర్‌బోర్ పనులకు పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిపాలన నాలుగేళ్లులో కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులను చేసామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలో మున్సిపాలిటీని అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపాలిటీలో తాగునీటి వెతలు నివారించేందుకు 25 వార్డుల్లో ప్రతి చోట పవర్‌బోర్లును ఏర్పాటు చేసామని, భవిష్యత్తులో నీటి ఎద్దడి పరిస్థితి రాకూడదనే ధ్యేయంతో బోర్లు వేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు వసతి, తాగునీరు, పారిశుద్ద్యం వంటి సౌకర్యాలు కల్పించినట్లైతే వారి రుణం తీర్చుకున్నట్లేనన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు సంతృప్తిని ఇచ్చిందని, మరో ఏడాదిలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. తన పాలకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడంతో కొంతమంది పాలకులు కక్ష కట్టి అడ్డుకట్ట వేయాలని చూసినప్పటికి ప్రజల ఆదరాభిమానాలతో వాటిని తిప్పికొట్టి పూర్తి చేయగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో బి.శ్రీనివాసరావు, సవర సుమన్, కె.కృష్ణారావు, మజ్జి ఆశ, సంతోష్‌పండా తదితరులు పాల్గొన్నారు.