శ్రీకాకుళం

ముఖ్యమంత్రి పర్యటన ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 14 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి శ్రీకాకుళం లోని ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకొని అక్కడ బస చేస్తారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఆర్ అండ్ బి అతిధి గృహం నుండి బయలుదేరి 80్ఫట్ రోడ్డు గుండా ఏడు రోడ్ల జంక్షన్ పాలకొండ మీదుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని స్వాతంత్య్ర దినోత్సవ వేదిక వద్దకు చేరుకుంటారు. తొమ్మిది గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 11.15 గంటలకు హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. 12గంటలకు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల నుండి ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక హెలీకాఫ్టర్ లో విశాఖపట్నం విమానశ్రయానికి చేరుకుంటారు.
అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 14 : మండలంలోని రాగోలు పంచాయితీ పరిధిలో నిర్వహించే అమ్మవారు పండుగ ఉత్సవాల్లో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ అమ్మవారు ఉత్సవాలను నగరానికి చెందిన కొంత మంది రాగోలు లో వేంచేసియున్న అమ్మవారి ఉత్సవాలను ప్రతీ ఏటా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే లక్ష్మీదేవి ని ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని ఎమ్మెల్యే లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్‌కుమార్, రమేష్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.