శ్రీకాకుళం

ప్రత్యేక హోదా కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 14 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శాప్ మాజీ చైర్మన్ పి ఆర్ మోహన్ మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసన తెలియజేసారు. విభజన హామీలు అమలు చేయాలని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో రకరకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పటికి కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అది సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. తలకిందులుగా క్రేన్‌కు వేలాడుతూ ప్రత్యేక హోదా బ్రోచర్ ను చూపిస్తూ నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టీడీపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ఎస్ వి రమణమాదిగ, జామి భీమ శంకర్, గొర్లె రమణ, ఇప్పిలి తిరుమలరావు, సాదు చిన్నికృష్ణ, బలగ శివప్రసాద్, పాండ్రంకి శంకర్ తదితరులు ఉన్నారు.
ఆఫ్కో అక్రమాలను అరికట్టాలి
* ఆఫ్కో కార్యాలయం వద్ద ఉమామహేశ్వరి దీక్ష
శ్రీకాకుళం(రూరల్) ఆగస్టు 14 : ఆఫ్కో అక్రమాలను అరికట్టాలని, కుట్టు పని స్ధానికులకే అప్పగించాలని పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం ఆఫ్కో కార్యాలయం వద్ద గ్వానిస్ స్వచ్ఛంద సంస్ధ అధ్యక్షురాలు శవ్వాన ఉమామహేశ్వరి, దర్జీలు దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి నుంచి ఆఫ్కో కార్యాలయం వద్ద దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాకు చెందిన ఒక్క దర్జీకి కూడా కుట్టుపని అప్పగించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్ధులకు ఇచ్చే ఏకరూప దుస్తులు క్లాత్ అంతా ఒకే చోటు నుండి సరఫరా అవుతుందని అది కూడా క్లాత్ కాకుండా కటింగ్ మూర్తులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒకే రకం క్లాత్ ఇవ్వడం లేదని వెనుక ఒక రంగు, ముందు వైపు ఒక రంగు ఉంటుందని తెలియజేసారు. ఈ రకంగా క్లాత్ ఇవ్వడంపై గత ఏడాది కేసు కూడా నమోదైనట్లు స్పష్టం చేసారు. ఈ విషయమై ఆఫ్కో డి ఎం, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన్నప్పటికి ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర స్ధాయి అధికారులు దృష్టి సారించి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆమె డిమాండ్ చేసారు.