శ్రీకాకుళం

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), ఆగస్టు 17: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వౌళిక సౌకర్యాలు అందిపుచ్చుకొని ప్రజలు పరస్పరం సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని అవలంగి గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని అవలంగి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెలను శతశాతం మరుగుదొడ్లు నిర్మాణంతో పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాయన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపడడం ద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చునన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనతో పల్లెలు అపరిశుభ్రంగా తయారవుతాయన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు, రహదారులు, కాలువలు, అంగన్‌వాడీ భవనం, పాఠశాలకు వంట గది ఏర్పాటు తదితర సమస్యలపై గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అవలంగి గ్రామంలో పనిచేస్తున్న అధికారులు, గ్రామ పెద్దలకు జిల్లా కలెక్టర్ అభినందించారు. అంతకుముందు గ్రామంలో కలెక్టర్ మొక్కలు నాటి పచ్చదనంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ గరికివాడు తదితరులున్నారు.

దేవీ ఆశ్రమంలో శ్రావణ మాస పూజలు
ఎచ్చెర్ల, ఆగస్టు 17: మండలంలోని కుంచాల కుర్మయ్యపేట సమీపంలోనున్న శ్రీచక్రాపురంలో రాజరాజేశ్వరి దేవీ ఆశ్రమంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కర శర్మ (బాలుస్వామి) వేకువ జామునుంచి అమ్మవారికి వివిధ అభిషేకాలు నిర్వహించి భక్తుల దర్శనార్ధం మరింత సుందరంగా అలంకరించారు. అలాగే అనేక పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కూడా అధిక శాతం అమ్మవారిని దర్శించుకొని గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీచక్రాల వద్ద కుంకుమ పూజలు నిర్వహించి మహామేరుకు పూజలు చేశారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల కలిగే శుభాలను బాలుస్వామి భక్తులకు వివరించారు. 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే ఇంటిళ్లపాటి సుఖశాంతులతో పరిడిల్లుతారని ఆయన సూచించారు. లలితా శహశ్ర పారాయణం, ఖడ్డమాల స్తోత్రం భక్తులతో పారాయణం నిర్వహించారు. భక్తులందరికి ప్రసాద వితరణ, అన్న సమారాధన కార్యక్రమాలు జరిపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు తరలి రావడంతో శ్రీచక్రపురం పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ కార్యక్రమంలో అనంత శర్మ, అయ్యప్ప శ్రీను, విశ్వనాధ శర్మ, పప్పల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌కోట టీడీపీ ఇన్ ఛార్జ్‌గా రమేష్
ఆమదాలవలస, ఆగస్టు 17: రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి కమిటీ మెంబరుగా పనిచేస్తున్న స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు మొదలవలస రమేష్‌ను విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా అధిష్టానం నియమించింది. ఈ మేరకు శుక్రవారం టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి తనకు ఉత్తర్వులు అందాయని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీనాయకులను, కార్యకర్తలను, అభిమానులను సమన్వయం చేస్తూ పార్టీ విజయానికి కృషి చేయవలసివుంటుందని రమేష్ తెలిపారు. నియోజక వర్గంలోని మండలాలు, పంచాయతీల్లో పార్టీ పనితీరుపై అధిష్టానంకు ఎప్పటికప్పుడు నివేదికలు అందించవలసివుంటుందని రమేష్ అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో అధిష్టానం అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తానని రమేష్ తెలిపారు.