శ్రీకాకుళం

బదిలీలకు మార్గం సుగమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 22: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి మార్గం సుగమమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను జూన్ 8 నుంచి 15 వరకూ నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులతో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ మేరకు విధివిధానాలను ప్రభుత్వం మరి రెండురోజుల్లో ప్రకటించనుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నిర్వహణకు సి.ఎం. ఆమోదం తెలపడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించినట్లు అయ్యింది! జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 20 శాతం కేడర్ స్ట్రెంగ్త్ ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేయాలని జిల్లాకు చెందిన ఎన్టీవో సంఘం నాయకులు చౌదరి పురుషోత్తంనాయుడు, హనుమండు సాయిరాం, శర్మ వంటి వారు కోరుతున్నారు. 2014, నవంబరులో నిర్వహించిన బదిలీల ప్రక్రియలో సున్నా సర్వీసు ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేశారు. ఆ విధానాన్ని ఉద్యోగ సంఘం నాయకులు వ్యతిరేకించడంతో 2015, ఆగస్టులో 20 శాతం కేడర్ స్ట్రెంగ్త్ ప్రకారం ఉద్యోగుల బదిలీలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా ఉద్యోగుల బదిలీలు నిర్వహించాలని ఎన్జీవో నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సున్నా సర్వీసు ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేస్తే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అనుభవజ్ఞులైన ఉద్యోగులు లేక పరిపాలన కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుందనేది ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయం. 20 శాతం కేడర్ స్ట్రేంగ్త్ ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహిస్తే జిల్లాలో దాదాపు 4800 మంది ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి పలు శాఖలకు వేర్వేరుగా విధివిధానాలను ప్రభుత్వం జారీ చేయనుంది. రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ఖజానా తదితర శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు, ఇతర శాఖల ఉద్యోగుల బదిలీలకు వేర్వేరుగా విధివిధానాలు జారీ అవుతాయి. ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల విషయంలో కనీసం ఐదేళ్ళ సర్వీసు పైబడిన వారిని బదిలీ చేసేలా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడవచ్చని ఉద్యోగ సంఘ నాయకుడొరుకు తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులను సమకూర్చే అపభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల విషయంలో కనీసం రెండేళ్ళ సర్వీసు పైబడిన ఉద్యోగులను బదిలీ చేసేలా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల్లో ఉద్యోగ సంఘాల నాయకులకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్ల ఉద్యోగ సర్వీసు కనీసం తొమ్మిదేళ్ళుపైబడితే విధిగా బదిలీ అయ్యేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుందని జిల్లా ఎన్జీవో నాయకులు ఆంధ్రభూమికి చెప్పారు.