శ్రీకాకుళం

డిసెంబర్‌లోగా తపాలాకార్యాలయాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, సెప్టెంబర్ 21:దేశంలోగల అన్ని తపాలా కార్యాలయంలో డిశంబర్ నెలాఖరునాటికి బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు జిల్లా తూర్పుడివిజన్ తపాలాశాఖ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జిల్లాలో 10 బ్రాంచ్‌లలో ఈ వ్యవస్థను ఇప్పటికే ప్రారంభించామన్నారు.స్థానిక తపాలా కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఏటీ ఎం కార్డ్ మాదిరిగా తమ శాఖ యు ఆర్ కార్డ్‌ను ప్రవేశపెట్టనుందని, ఈ కార్డ్‌తో మొబైల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే అవకాశం వుంటుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రధాన తపాలా కార్యాలయాలతో పాటు గ్రామీణ తపాలా కార్యాలయలను కూడా ఆధునీకరించనున్నట్లు ఆయన వివరించారు. తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ ఇస్తూ గ్రామీణ తపాల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, తన పరిథిలో గల 70 కార్యాలయాల్లో 10వేల మంది బీమా ఖాతాదారులుగా వున్నారన్నారు. గరిష్టంగా రూ.10లక్షల వరకు బీమా పాలసీ ఇస్తున్నామని వివరించారు. దేశ వ్యాప్తంగా లక్షా ఏబై ఐదువేల తపాలా కార్యాలయాల్లో త్వరలో మరింత మెరుగైన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక తపాలా కార్యాలయాధికారి పి.రవికిరణ్, బ్రాంచ్ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
గురజాడ జీవితం ఆదర్శం
లావేరు, సెప్టెంబర్ 21: మహాకవి గురజాడ జీవితం ఆదర్శంగా తీసుకొని విద్యావంతులు సమాజాన్ని తీర్చి దిద్దే మహా కవులుగా రూపుదిద్దాలని స్థానిక శాఖా గ్రంథాలయాధికారి ఎమ్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో శుక్రవారం గురజాడ అప్పారావు 156వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాడు కన్యాశుల్కాన్ని రాసిన గురజాడ సమాజాన్ని ఎంతో ప్రభావితాన్ని చేశారని ఆయన పేర్కొన్నారు. గురజాడ సేవలు నేటికి మరువరాని వన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధాయ అవార్డ్ గ్రహీత ఎ.్ధళికేశ్వరరావు మాట్లాడుతూ గురజాడ రచనలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు గడ్డెయ్య, పలువురు విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో ఆరుబయట వంటలపై ఆంక్షలు
లావేరు, సెప్టెంబర్ 21: పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించబడిన మధ్యాహ్న భోజన పథకంలో ఆరుబయట వంటలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎట్టిపరిస్థితిల్లోను ఆరుబయట, చెట్లు కింద వంటలు చేయకూడదని ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులకు భోజన సరఫరా సమయంలో ఆరుబయట క్యూలైన్‌లో నించోబెట్టడం, అపరిశుభ్ర వాతావరణంలో వండి వడ్డించడం చేయకూడదని సూచించింది. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు తగిన పరిశుభ్రత పాటించి విద్యార్థులకు ఆరోగ్యకర వాతావరణంలో భోజనాలు వడ్డించాలని సూచించారు. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారి లండ ఈశ్వరరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు జారీచేశారు.