శ్రీకాకుళం

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.సిగడాం, సెప్టెంబర్ 21: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన గడగడపకు వైసీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టీడీపీ భూటకపు మాటలుకు విసిగిపోయారని, రావాలి జగన్..కావాలి జగన్ అంటున్నారని ఆయన తెలిపారు. జగమెరిగిన సత్యం, జనం మాట..జగన్ బాట.. కాబోయే జగన్ అని ఆయన అన్నారు. ఇందుకోసం కార్యకర్తలంతా మరింత మనోధైర్యంతో పనిచేసి జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు శ్రమించి పనిచేయాలని అన్నారు. మీ వెంట నేనుంటాను..అధైర్యపడకండి అని కార్యకర్తలకు బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.నాయుడు, ఎమ్. ఎన్ నారాయణ, ఎమ్.శ్రీను, ఎమ్. ఎన్ ఎస్ రావు, ఆర్ ఆర్ నాయుడు, మీసాల వెంకటరమణ, కాయల రమణ, నక్క ప్రసాద్‌తో పాటు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్ అండ్ బి రహదారుల్లో అవినీతి గోతులు
* వాహన చోదకులకు పాట్లు
ఆమదాలవలస, సెప్టెంబర్ 21: స్థానిక ఆర్ అండ్ బి డివిజన్ కార్యాలయం పరిథిలో ఉన్న వివిధ గ్రామాల రహదారుల్లో అవినీతి గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ గోతులు పూడ్చి మరామ్మత్తులు చేపట్టేందుకే ఏటా లక్షలాదిరూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ పనులు తూతూ మంత్రంగా నిర్వహించి నిధులు స్వాహా జరుగుతున్నట్లు బహిరంగ ఆరోపణలున్నాయి. మండలంలోని దూసిరోడ్, కొత్తరోడ్, అక్కులపేట, నెలిపర్తి,తొగరాం, కొర్లకోట, తమ్మయ్యపేట తదితర గ్రామాల రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని పలువురు వాహన చోదకులు, బాటసారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్లు మరామ్మత్తుల సమయంలో సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపణలున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయ్యి ప్రభుత్వ నిధులు దోచుకుతింటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీర్లు పర్సంటేజీల మత్తులో బిల్లులు చెల్లిస్తున్నారే తప్ప కనీస నాణ్యతలు పాటించడం లేదని పలువురు వాపోతున్నారు. తుఫాన్ పునరావాసం పనుల్లో భాగంగా ఈ రోడ్డుకు మరామ్మత్తులుకై ప్రభుత్వ నిధులు భారీగా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ పనుల్లో కసరబుగ్గి వేసి పైపైన తారుచుక్కలతో గోతులు కప్పడంతో చినుకుపడిన వెంటనే ఈ బుగ్గితేలి యధాతథంగా గోతులుగా మారుతున్నాయి. ఈరోడ్లు పక్క తుప్పలు బాగా పెరిగిపోవడంతో ఒక పక్క గోతులు, మరోపక్క తుప్పలతో వాహనచోధకులు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ రోడ్లు స్థానంలో పక్కారోడ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
తుఫాన్ దాటాలని కోరుతూ విఘ్నేశ్వర యజ్ఞం
ఆమదాలవలస, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శుక్రవారం రానున్న థాయో తుఫాన్ తీరం దాటి వెళ్లిపోవాలని కోరుతూ పట్టణంలోని మెట్టక్కివలస వద్ద వరాల విఘ్నేశ్వర గుడిలో స్థానిక రైల్వే ఉద్యోగి, ప్రముఖ సంఘ సేవకుడు కర్ఘపూర్ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా యజ్ఞం నిర్వహించారు. ఈ తుఫాన్ ఉత్తర కోస్తాపై పంజా విసిరి కేరళ మాదిరిగా విళయతాండవం సృష్టించేందుకే తుఫాన్ ముందుకు వస్తుందని దీన్ని అడ్డుకొని తీరం దాటించాలని కోరుతూ ఇక్కడ పలువురు వేద పండితులు ఈ యజ్ఞంలో పూజలు నిర్వహిచారు. ప్రముఖ వేదపండితుడు బలివాడ చిట్టిపంతులు సూచనలు మేరకు మరికొంతమంది రుత్వికులుతో సుమారు 8గంటల పాటు యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, వేదపండితులు పాల్గొన్నారు.