శ్రీకాకుళం

సిపి ఎస్ రద్దు కోసం దేశ వ్యాప్త ఉధ్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 21: సిపి ఎస్ రద్దుకోసం అక్టోబర్ 29న ఛలో రాజ్‌భవన్, నవంబర్ 15న సమ్మెలతో దేశవ్యాప్తంగా ఉధ్యమాలు చేపట్టనున్నట్లు యూటి ఎష్ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం యుటి ఎఫ్ జిల్లా కార్యవర్గం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సిపి ఎస్ రద్దు కోసం ఫ్యాక్టో ఆధ్వర్యంలో సిపి ఎస్ యాత్రలు, మాస్ క్యాజువల్ లీవ్‌లు పెట్టి జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి, ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో సమరశీలంగా పోరాడిన ఉపాధ్యాయ, ఉద్యోగ మిత్రులందరికి యుటి ఎఫ్ శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర గౌరవఅధ్యక్షులు కె ఎస్ ఎన్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌లు ఉధ్యమాభివందనాలను తెలియజేశారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా సిపి ఎస్ రద్దు కోసం పోరాటాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డి మోహనరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యుటి ఎఫ్ నాయకులు, పిడి ఎఫ్ ఎమ్మెల్సీ జార్జ్ విక్టర్, ఏపీటి ఎఫ్ రాష్ట్ర నాయకులు సింహాద్రి అప్పడు, జిల్లా యుటి ఎఫ్ నాయకుడు కిమిడి శ్రీనివాసరావు తదితరుల మృతికి సంతాపం ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర కార్యాకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె ఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ 11వ పి ఆర్సీకి సంబంధించి 34శాతం అయ్యార్‌ను ప్రకటించాలని, 68శాతం ఫిట్‌మెంట్‌తో పి ఆర్సీని ప్రకటించాలని, సర్వీస్‌రూల్స్ సమస్య పరిష్కరించాలని, ప్రమోషన్లు చేపట్టాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కోశాధికారి పొందూరు అప్పారావు, రాష్ట్ర ఆడిట్ సభ్యులు ఎస్.కిషోర్‌కుమార్, బమ్మిడి శ్రీరామ్మూర్తి, పి.్ధర్మారావు, భాస్కరరావు, బాబూరావు, చినబాబు,చంద్రరావు, వైకుంఠరావు, సుశీల, శారద, సురేష్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు మజ్జితులసీదాస్
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 21: స్థానిక గురజాడ విద్యాసంస్థల్లో దివంగత మజ్జి తులసీదాస్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంస్థల ప్రాంగణంలో నెలకొల్పిన మజ్జి విగ్రహానికి సంస్థ అధినేత జి.వి స్వామినాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్పీ భార్గవనాయుడు మాట్లాడుతూ నిరాడంబరుడు.నిశ్వార్థ ప్రజాసేవకుడు మజ్జితులసీదాస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పులఖండం శ్రీనివాసరావు, కరస్పాండెంట్ అంబటి రంగారావు, కళాశాల ప్రిన్సిపాల్ లవకుమార్, పంగ మహేష్, కెవివి సత్యన్నారాయణ, ఢిల్లీశ్వరరావు, మూర్తి, జి.కృష్ణమూర్తినాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.
యుగకర్త గురజాడ
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 21: మండలంలోని మున్సబ్‌పేట సమీపంలో ఉన్న గురజాడ విద్యాసంస్థలో శుక్రవారం గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యాసంస్థల ప్రాంగణంలో నెలకొల్పిన గురజాడ విగ్రహానికి విద్యాసంస్థల అధినేత జివి స్వామినాయుడు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఆధునిక యుగానికి, ప్రాచీన యుగానికి వారథి వంటి వాడు గురజాడని, నేటి తరానికి మార్గదర్శి అని కొనియాడారు. గురజాడ అడుగుజాడలు అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు, అంబటి రంగారావు, లవకుమార్, సత్యన్నారాయణ, మహేశ్, కృష్ణమూర్తినాయుడు, రమణమూర్తి, వెంకటేశ్, శ్యాం, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
పూడిలంక ఉప్పుటేరులోకి భారీగా చేరిన వరద నీరు
వజ్రపుకొత్తూరు, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూడిలంక ఉప్పుటేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తుంది. పూడిలంక కాలిబాట వంతెనపై నుంచి రెండు అడుగుల నీరు ప్రవహిస్తుంది. దీంతో గ్రామం నుంచి ప్రజలు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు ఉన్న వారు అష్టకష్టాలు పడి పూడిలంక జంక్షన్‌కు చేరుకుంటున్నారు. మంచీనీళ్లపేట, గుణుపల్లి, దేవునల్తాడ, డోకులపాడు, నువ్వలరేవు, అక్కుపల్లి తీరంలో తుపాన్ ప్రభావంతో అలలు నాలుగు మీటర్లు ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అలల ఉధృతికి తీరంలో నిలిపిన బోట్లు దూరం వరకు కొట్టుకు వస్తున్నాయని మత్స్యకారులు తెలిపారు. సముద్ర పరిసర గ్రామాల్లో శుక్రవారం అధికారుల బృందం పర్యటించి చేపలవేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అప్రమత్తం చేసారు. సాయంత్రానికి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సముద్ర తీరప్రాంతవాసులు, పూడిలంక వంటి లోతట్టు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతకు మరుగుదొడ్డి తప్పనిసరి
వజ్రపుకొత్తరు, సెప్టెంబర్ 21: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండాలని, అందుకోసం వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలని ఎంపిడివో వి.తిరుమలరావు అన్నారు. శుక్రవారం మెట్టూరులో రెండో విడత వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సమావేశం నిర్వహించారు. మెట్టూరులో 323 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయని, 315 నిర్మాణం లబ్ధిదారులు పూర్తి చేసారన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవడం, మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లతో ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యంగా మహిళల్లో చైతన్యం రావడం ద్వారా లక్ష్యాలను పూర్తి చేయగలిగామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల ప్రతినిధుల సహకారంతో సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. వైస్ ఎంపిపి జేజేరావు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.