శ్రీకాకుళం

ఉపాధిలో అక్రమాలపై విచారణ జరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 30: జిల్లాలోని భామిని మండలం దిమ్మిడిజోల పంచాయతీకి చెందిన కొత్తచెరువులో ఉపాధి హామీపథకంలో భాగంగా బినామీ మస్తర్లు వేసి మేట్ సొమ్ము కాజేశారని విచారణ చేయించి తగిన చర్యలు తీసుకోవాలని దిమ్మిడిజోలకు చెందిన కె.రామారావు, పి.రామ్మూర్తిలు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంను కోరారు. కలెక్టర్ ఫిర్యాదుల విభాగంలో సోమవారం కలెక్టర్‌తో పాటు జెసి వివేక్ యాదవ్‌లు అర్జీలు స్వీకరించారు. బకాయిపడిన ఐదు నెలల వేతనాలు చెల్లించేలా సంబంధిత ఏజెన్సీని ఆదేశించాలని రిమ్స్ కాంట్రాక్టు, ఔట్‌సోర్శింగ్ వర్కర్స్ యూనియన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని 14 ఆదర్శ పాఠశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న తమను 2016-17 ఏడాదికి కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బి.రాజశేఖరరావు, మదన్‌మోహన్, అనితలు వినతిపత్రం అందజేశారు.
పొందూరు మండలం బొడ్డేపల్లి రెల్లిగెడ్డ ప్రస్తుతం ఉన్న 15 మీటర్ల వెడల్పు నుండి 45 మీటర్లు వెడల్పు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన బమ్మిడి కృష్ణమూర్తి, బి.తేజేశ్వరరావు, మొదలవలస రాజారావు తదితరులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి ఎస్.తనూజారాణి, డుమా పిడి పి.కూర్మనాథ్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.