శ్రీకాకుళం

ప్రజల పక్షాన పోరాడుతునే ఉంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 8: ప్రభుత్వ ఒత్తిళ్ళకు బయపడేది లేనేలేదు..ప్రజల పక్షాన పోరాడుతునే ఉంటా..తన గొంతు నొక్కేందుకు ఇరుకునపెట్టాలని చూస్తున్న అధికార పార్టీ చేసే దుశ్చర్యలను సమయం వచ్చినప్పుడు వాస్తవాలు బయటపెడతానంటూ వైసీపీ రీజనల్ కోర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. గురువారం ఇక్కడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు చెందిన రెండు గ్రానైట్ క్వారీల లీజులను రద్దు చేసారని, తన స్థలాలకు సంబంధించిన పలు పత్రాలను ఇవ్వకుండా ఐ.ఎ.ఎస్. అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, వాటికి భయపడేది లేదని సుస్పష్టం చేసారు. సిట్ నివేదికలో తన పేరు చేర్చడంపై న్యాయపరంగా పోరాటతామన్నారు. నిజాయితీగా ప్రతిపక్షాన్ని గౌరవించలేని కారణంగా ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహారిస్తుదని మండిపడ్డారు. అనుభవం అంటే ఇదేనా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. గత నాలుగున్నర ఏళ్ళుగా తనకు చెందిన వ్యాపారాలకు ఇబ్బందులు పెడుతూ ప్రజల పక్షాన ఎత్తే గొంతును నొక్కేయడానికి చేసే ప్రయత్నాలన్నీ తన ముందు పనిచేయవన్నారు. విశాఖ భూకుంభకోణం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలేనని వారి జోక్యంతోనే అదంతా జరిగిందని అన్నారు. అటువంటివారిని సిట్ దర్యాప్తులో విస్మరించి తనను ఇరికించి ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుతోవపట్టించేందుకు పన్నిన వ్యూహాంగా వర్ణించారు. ఎన్నో తప్పిదాలు చేసిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చేలా సిట్ పరిశోధనను నిర్వీర్యం చేసి, ప్రతిపక్షాన్ని పతనం చేసేందుకు పన్నిన పన్నాగంతో తాను ఏమీ బెదిరిపోయేవాడను కాదన్నారు. రాజకీయ పదవులు కోసం పాకులాడే నైజం తనది కాదని, ప్రజలు అంగీకరించి అర్హత కల్పిస్తే పదవులు వాటికి అవే వస్తాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తాను చేస్తున్న గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి రెండు క్వారీలకు అనుమతులు ఇవ్వకుండా అధికారులను భయపెట్టి ఆ వ్యాపారంలో అడ్డంకులు సృష్టించిన టీడీపీ నేతలు, తాజాగా ఇక్కడ మారుతీ ధియేటర్ వద్ద గల ఖాళీ స్థలంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలను నిర్మించి వందలాది మందికి తద్వారా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వానికి అనుమతులు కోసం దరఖాస్తులు చేస్తే ఇప్పటికీ సంబంధిత అధికారులు ఆ ఫైల్‌ను తొంగిచూడకుండా ఎన్నో అభ్యంతరాలు పెడుతూ అనుమతులు ఉడా నుంచి ఇవ్వకుండా అల్లరి చేస్తున్న విషయం జిల్లా ప్రజలందరికీ తెలిసన్నారు. అటువంటి నీతిమాలిన పనులకు దిగజారిన వారు తన పేరును విశాఖ భూకుంభకోణంలో ఇరికించడం పెద్ద పనికాదన్నారు. సంవత్సరాలు తరబడి తన స్థలంలో నిర్మాణాలకు వుడా అనుమతులు ఇవ్వకుండా, కేవలం 11 రోజులలోనే అర్బన్ డెవలప్‌మెంటు అథారిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రతిపాదనలకి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14, 2016న ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం రైతుల నుంచి ఇతర వర్గాల నుంచి దరఖాస్తులు రావడం ఆయా సర్వే నెంబర్లలో భూములను ప్రభుత్వం పరిశీలన చేయడం చివరికి నవంబర్ 25, 2016న ప్రభుత్వం లే అవుట్ ఏర్పాటుకి ఆదేశాలు ఇవ్వడం ఆగమేగాల మీద జరిగిపోయయన్నారు. కేవలం 11 రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసిన ప్రభుత్వం తన స్థలానికి మూడేళ్ళుగా నిర్మాణానికి తగిన అనుమతులు కోసం దరఖాస్తులు చేస్తే ఇప్పటికీ దానిపై స్పందించలేదని వివరించారు. అటువంటి కక్షసాధింపు చర్యలన్నీ జిల్లా ప్రజలకు గమనిస్తునే వున్నారన్నారు. భూకుంభకోణం వెనుక ఉన్న ప్రభుత్వం పెద్దల బండారాన్ని సిట్ ఎందుకు సోదించలేదన్న దానికి ప్రజలవద్దే సమాధానం ఉందన్నారు. ఇతరులను టార్గెట్ చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురాకుండా ఉండేందుకు సిట్ దర్యాప్తులో తన పేరు చేర్చారన్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు వైసీపీ నేతలు చల్లా రవికుమార్, అంధవరపు సూరిబాబు, చిరంజీవి, అంబటి శ్రీను, మూకళ్ళ తాతబాబు, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, ఆర్.ఆర్.మూర్తి, సీజు తదితరులు ఉన్నారు.

రాజధానిలో జరిగే రైతుకవాతు, ధర్నాలను జయప్రదం చేయండి
పలాస, నవంబర్ 8: సోమనాథం కమిటీ సిఫార్సు అమలు చేసేందుకు అన్ని పంటలు గిట్టుబాటు ధర ప్రకటించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 29,30వ తేదిల్లో ఢిల్లీలో జరిగే రైతుకవాతు, ధర్నాలను జయప్రదం చేయాలని పలు ప్రజాసంఘాల నాయకులు కోరారు. గురువారం కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో వివిధ ప్రజాసంఘాల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సోమనాథన్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన నేటికి అమలు చేయలేదని, రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికి నాలుగున్నర ఏళ్లు గడిచినా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలోని రైతు రుణమాఫీ పూర్తిగా అమలుకాకపోవడంతో రైతుల అప్పుల్లో కూరుకుపోయారన్నారు. తిత్లీ తుపాన్ కారణంగా రైతాంగం సర్వస్వం కోల్పోయి ఆర్థికంగా నష్టపోయారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. దేశంలో 208 ప్రజాచట్టాలను విలీనం చేసారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మెహనరావు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మాధవరావు, ఎన్.గణపతి, ఉద్దాన విద్యాభివృద్ధి వేదిక సభ్యులు బి. ఓంకార్, నవీన్‌కుమార్, జి. ఆనందరావు, జె.శ్రీరాములు, లక్ష్మినారాయణ, భూపతిరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.