శ్రీకాకుళం

పేదల సమస్యలు పరిష్కరించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 30: జిల్లాలోని హిరమండలంలో నివశిస్తున్న నిరుపేద కుటుంబాలకు సర్వే నెం.96, 97లో ఇచ్చిన స్థలాలు కొంతమంది ఆక్రమించుకుంటున్నారని, ఇదే విషయంపై తహశీల్దారు దృష్టికి తీసుకువచ్చినా సంబంధం లేదంటున్నారని గ్రామానికి చెందిన పి.శంకరరావు, బి.మల్లేశ్వరరావు, ఎం.రమణ తదితరులు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంనకు ఫిర్యాదు చేశారు. సోమవారం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడారు. ఆరేళ్ళ కిందట అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆదేశానుసారం నిర్వాసితులకు 431 పట్టాలిచ్చారన్నారు. అయితే, ఆ పట్టాల్లో సుమారు 120 పట్టాలు లోతట్టు ప్రాంతంలో ఉన్నందున వాటిని కప్పించుకునే స్తోమత లేదన్నారు. ఈలోగా హిరమండలానికి చెందిన కొంతమంది వ్యక్తులు మాకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకుంటున్నారని, ఈ విషయాన్ని తహశీల్దారు దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు లేవన్నారు. పైగా రెవెన్యూ అధికారులు ఇదే స్థలంలో ఉన్నవారికి వంశధార కుడిప్రధాన కాలువగట్టుపైన స్థలాలు మంజూరు చేశారని, ఈ విషయాన్ని తహశీల్దారు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అయినప్పటికీ తమకు సంబంధం లేన్నట్టు తహశీల్దారు వ్యవహరించడం సబబుగా లేదని మాకు న్యాయం చేయాలని సుమారు వందమంది నిరుపేదలు కలెక్టర్‌ను వేడుకున్నారు. కార్యక్రమంలో వి.అరుణ, డి.రాజేశ్వరి, బి.ప్రభావతి పాల్గొన్నారు.