శ్రీకాకుళం

మోడీకి ఆంధ్రా వారుంటే చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 15: ప్రత్యేక హోదా సాధనకై, విభజన చట్టాల అమలుకై ఇదే ఆఖరిపోరాటమని, ప్రధానమంత్రి మోడీకి ఆంధ్రావారింటే చిన్నచూపు అని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి జె.రామకృష్ణ ధ్వజమెత్తారు. గురువారం పలాసలో ప్రత్యేకహోదా, విభజన హక్కుల సాధనకై విద్యార్థి జె ఎసీ సంఘం, వామపక్షాలు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమరయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీకాకుళం నుంచి 13 జిల్లాల మీదుగా అనంతపురంలో ముగియునున్నాది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాల గెడ్డ, విప్లవ ఉద్యమాల పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతంలో సమరయాత్ర ప్రారంభమై 13 జిల్లాల్లో 15 రోజులుపాటు యాత్ర కొనసాగుతుందన్నారు. సీ ఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా సాధనపై మొదటి నుంచి దృష్టి సారించకపోవడంతో నాలుగున్నర ఏళ్లు గడుస్తున్న ఆంధ్రాకు హోదా దక్కలేదన్నారు. విద్యార్థులు, యువజన సంఘాల భాగస్వామ్యంతో బీజేపీ పాలకులతో తాడోపేడో తేల్చుకునేందుకు డిసెంబర్ నెలలో దేశ రాజధానిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రావారు అంటే తెగువ, కసి ఉన్నారని, వారి సత్తా ఏమిటో రానున్న ఎన్నికలల్లో చూపిస్తారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధనలో ఎందరో విద్యార్థులపై, ఉద్యమకారులపై ఉన్న కేసులను తొలగిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినప్పటికి నేటికి అమలు చేయలేదన్నారు. ప్రజలు నిజమైన హీరోలు, చిత్ర దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, నటుడు సంపూర్ణేష్‌బాబు అని, వారే ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలిపారన్నారు. ఆంధ్రా హక్కులు కోసం ఎవరు నిలదీస్తారో వారే నిజమైన హీరోలు అని, ఈ పోరాటం విద్యార్థుల కోసమేనని, భావితరాల భవిష్యత్తు కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీని నమ్మి చంద్రబాబునాయుడు మోసపోయారని, ఆంధ్రాప్రజలను మోసం చేసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరితే చంద్రబాబు ఒక్కరే వెళ్లి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకున్నారన్నారు. దక్షిణాదిలో 13 కోట్ల తెలుగు ప్రజలు ఉన్నారని, మోడీపై వెళ్లి మోసం చేసింది తెలుగు ప్రజలనేనన్నారు. అనంతరం సమరయాత్రను ప్రారంభించారు. మందస మండలంలో ఉద్దానకేసుపురం గ్రామంలో తిత్లీ తుపాన్ ప్రభావంతో నేలకొరిగిన జీడి, కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీ ఐ కార్యదర్శి నాగేశ్వరరావు, దర్శకులు ఆర్.నారాయణమూర్తి, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థుల యువజన సంఘం జె ఎసీ కన్వీనర్ లెనిన్‌బాబు, కో కన్వీనర్ సూర్యనారాయణ, ఎ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న, అధ్యక్షులు సుబ్బారావు, జనసేన యువజన విభాగపు అధ్యక్షుడు డాక్టర్ సతీష్, పిడి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర, ఏపిడబ్ల్యూజె మాజీ అధ్యక్షులు నల్లి ధర్మారావు, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి రమణ, ఎ ఐవై ఎం నాయకులు చాపర వేణుగోపాల్, చాపర సుందరలాల్, వినోద్, లండ వెంకటరావు, నర్శింహులు, ఎన్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో పలాస విద్యార్థుల ప్రతిభ
పలాస, నవంబర్ 15: 25వ బాలల జాతీయసైన్స్ కాంగ్రెస్ పోటీల్లో పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపించారు. పాలకొండలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో శక్తి పరిరక్షణ, శక్తి సామర్థ్యం అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీలో పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని హర్షిణి విజయం సాధించారు. గురువారం పాఠశాల ఆవరణలో హర్షిణితోపాటు గైడ్ టీచర్ రామారావును ప్రధానోపాధ్యాయులు డి.రామారావులు అభినందించారు.
అధైర్యపడవద్దు, నిరాశ్రయులైన వారికి ఇళ్లు
మందస, నవంబర్ 15: తిత్లీ తుపాన్ ప్రభావంతో నిరాశ్రయులైన అర్హులైన గిరిజన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని ఐటీడీ ఎ పివో ఎల్.శివశంకర్ అన్నారు. గురువారం దాలసరి గిరిజన గ్రామంలో విజయవాడ, అనంతపురం, కర్నూలులకు చెందిన ఆంధ్రాబ్యాంకు విశ్రాంతి ఉద్యోగుల నేతృత్వంలో 300 మందికి దుస్తులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసారు. దాలసరి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, నారాయణపురంలో రక్షితమంచినీటి పథకాన్ని నిర్మించి కొండమేర, బెల్లుభర, గౌరంగోసాయి గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. నాటుసారా జీవితాన్ని నాశనం చేస్తుందని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని నాటుసారా వాడకంపై ప్రభుత్వం నిషేధించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజరు రాజేంద్రకుమార్, లీడ్ బ్యాంకు మేనేజరు వెంకటేశ్వరరావు, జె.వి.రత్నం, డి.శివప్ప, ప్రసాద్, ఆర్.శ్రీనివాసరావు, ఎపి ఎం లలిత, జెవి నాయుడు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.