శ్రీకాకుళం

ప్రతీ ఇంటా నవనిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 30: ప్రతీ ఇంటా నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ప్రజలను కోరారు. నవ నిర్మాణ దీక్ష నిర్వహణపై సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవ నిర్మాణదీక్ష కార్యక్రమంలో భాగంగా జూన్ 2వ తేదీనుంచి 8వరకు ప్రతీ రోజు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. జూన్ 2న జిల్లా కేంద్ర, డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల, గ్రామస్థాయిలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామన్నారు. అదే రోజు ఉదయం 11గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను ప్రజలతో చేయిస్తారని అందులో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలన్నారు. సభకు హాజరు కాలేనివారు ఇంటి వద్దనే ఉండి తమకుటుంబ సభ్యులతో ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభా కార్యక్రమాల్లో సమైఖ్యాంధ్ర ఉద్యమం ప్రధానాంశాలు, ప్రస్తుతం ప్రగతి వంటి విషయాలను చర్చించాలన్నారు. 3వ తేదీన రాష్ట్రాన్ని ఆశాస్ర్తియంగా విభజించడం వలన జరిగిన పరిణామాలను గూర్చి చర్చించాలని, 4వ తేదీ రెండేళ్ళ కాలంలో సాధించిన అభివృద్ధి, 5వ తేదీ భవిష్యత్తులో అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు లక్ష్యసాధనకు అవసరమయ్యే మార్గాలను గూర్చి, 6న పరిశ్రమలు, సేవారంగం తదితర రంగాల గురించి, 7న సంక్షేమంపైన వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 8న మహాసంకల్పం కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం జరిగిన ప్రదేశాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు, అప్పటి స్మృతులను నెమరు వేసుకొనుటకు చాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో జెసి వివేక్‌యాదవ్, ఎస్పీ బ్రహ్మారెడ్డి, జిల్లా రెవన్యూ అధికారి బి.కృష్ణ్భారతి, ఆర్డివో దయానిధి, డుమా పీడి కూర్మనాథ్, డిఆర్‌డిఏ పిడి తనూజారాణి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్లుఎస్, వంశధార ఎస్‌ఇలు వి.రామచంద్ర, ఏ.మోహనమురళి, ఆర్. రవీంద్రనాథ్, బి.అప్పలనాయుడు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.శివరామనాయకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.శ్యామల, సెట్‌శ్రీ సిఇవో వివిఆర్‌ఎస్ మూర్తి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జి.రామారావు, వివిధ శాఖలాధికారులు పాల్గొన్నారు.

*