శ్రీకాకుళం

ఆదిత్యుని దర్శనానికి బారులు తీరిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 18: ప్రత్యక్ష నారాయణుడు శ్రీసూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తులు సుదీర ప్రాంతాలనుండి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా తల నీలాలు సమర్పించి ఇంద్రపుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో వేచియుండడం కన్పించింది. ఉచిత దర్శనం క్యూలైన్‌లోనే భక్తులు అధికంగా ఉన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు క్యూలైన్‌లో వేచియున్నారు. ఈనెల 20న నిర్వహించనున్న తెప్పొత్సవం కార్యక్రమానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తెప్పోత్సవం కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఇంద్రపుష్కరిణి సందర్శించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ప్రత్యేక ప్రవేశ దర్వనం ద్వారా రూ. 3,89,900, విశిష్ట ప్రవేశ దర్శనం ద్వారా రూ. 1,34,000, సూర్యనమస్కారాల ద్వారా రూ. 7,950, కేశఖండన శాల ద్వారా రూ. 44,625, లడ్డు, పులిహార విక్రయాల ద్వారా రూ.2,90,000 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.

...........

చిలుకల ద్వాదశి సందర్భంగా నాగావళి నదిలో తెప్పోత్సవం
శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 18: స్థానిక కలెక్టర్ బంగ్లా సమీపంలో నాగావళి నదీతీరాన వెలసిన శ్రీకళ్యాన తిరుమలలో వేంచేసి యున్న శ్రీదేవి, భూదేవిని సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చిలుకల ద్వాదశి (క్షీరాభ్థి ద్వాదశి) సందర్భంగా ఈనెల 20న శ్రీవారి తెప్పోత్సవం నాగావళి నదిలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి బెహరానాగేశ్వరరావు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు తెప్పోత్సవం జరుగునని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు పాల్గొంటారని భక్తజనులు పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ అధ్యక్షులు నల్ల అప్పారావు, కోశాధికారి గుదియా వెంకటరమణ, కమిటీ సభ్యులు కోరారు.

..........

వి ఆర్ ఏ లకు 482 జీవో రద్దు చేయాలి
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 18: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీ ఆర్ ఏ) 482 జీవోను రద్దు చేయాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు సత్యన్నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎజ్జల అప్పలస్వామి కోరారు. స్థానిక సి ఐటియు కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు పాత పద్ధతిలో 39 జీవో ప్రకారం ప్రమోషన్లు ఇస్తున్నప్పటికి ఇప్పుడు కొత్తగా 482 జీవోను ప్రభుత్వం తీసుకువచ్చి వీ ఆర్ ఏల మెడమీద కత్తిలా ఆ జీవోను పెడుతుందన్నారు. అమరావతిలో 15వేల మంది గ్రామరెవెన్యూ సహాయకుల సమక్షంలో 482 జీవోను రద్దుచేస్తాం, నామిని వీ ఆర్ ఏలగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పి ఆరు నెలలు గడిచినప్పటికి అతి జీవో రూపం దాల్చలేదన్నారు. అర్హులైన వీ ఆర్ ఏలకు దీని వల్ల వీ ఆర్‌వో, అటెండర్ ప్రొమోషన్‌లను అధికారులు ఇస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి అడ్డంకి వస్తుందన్నారు. ఈ మద్యకాలంలో కంచిలి, కవిటి, మందస తిత్లీ తుఫాన్‌లో వీ ఆర్ ఏలకు నిత్యావసర సరుకులు గాని, ఎటువంటి సదుపాయాలు గాని అందజేయలేదన్నారు. ముఖ్యమంత్రి స్వయాన వీ ఆర్ ఏల మద్య వారికి కార్డులు తొలగించమని, యధావిధిగా వారి రేషన్‌కార్డులు కొనసాగిస్తామని చెప్పినప్పటికి మందస మండలానికి చెందిన వి ఆర్ ఏలకు వారి రేషన్‌కార్డులు ఇన్ యాక్టివ్ కావడం జరిగిందన్నారు. దీనితో డీలర్లు సరుకులు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఇటువంటి పరిస్థితి కొనసాగితే పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అప్పలస్వామి, కొంక్యాన శాంతారావు, వీ ఆర్ ఏలు ఎస్.త్రినాధరావు, కె.వి రాజేశ్వరరావు, ఆర్. ఆదినారాయణ, డి.లచ్చయ్య, సి.హెచ్ రామరాజు, ఎమ్.లీలయ్య తదితరులు పాల్గొన్నారు.