శ్రీకాకుళం

‘టచ్’లో ఉన్నవారు జంప్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కొన్నాళ్ళుగా స్తబ్దతగా ఉన్న శ్రీకాకుళం రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం సంభవించబో తోంది. కొద్దిరోజులుగా ఊసేలేని నాయకుల వలస మళ్లీ ప్రారంభైనట్టు కనిపిస్తోంది. రాజాం, పాలకొండ శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరేఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల టిడిపి క్యాంపైన్ మంతనాలకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీరిద్దరి చేరిక కూడా దాదాపుగా ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ 2 లేదా 4వ తేదీన తెలుగుదేశం పార్టీ కండువా వేసుకునేందుకు వీరికంటే ముందు వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ అయిన పాతపట్నం ఎమ్మెల్యే దర్శకత్వంలో సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే-జిల్లాలోని పది నియోజకవర్గాలు టిడిపివే.. పదేసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు వేదికలమీద వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిని ఖాళీ చేయిస్తా! అన్న సవాల్ సెంటిమెంటు జిల్లా శ్రీకాకుళం నుంచే ఆరంభమయ్యేలా కన్పిస్తోంది. కాకపోతే, ఈ విషయాన్ని క్రమక్రమంగా వెల్లడించాలని వైకాపా ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకున్నట్టు ఉంది. సోమవారం అధినేత జగన్మోహన్‌రెడ్డితో అత్యవసర సమావేశానికి ఆ ఇద్దరూ వెళ్లారంటూ వారి అనుచరులు ప్రచారం చేస్తుంటే- సీనియర్ వైకాపా నేత పాలవలస రాజశేఖరం మాత్రం అటువంటి సమావేశం అధినేతతో ఉన్నట్టు తనకైతే సమాచారం లేదని ‘ఆంధ్రభూమి’కి స్పష్టం చేశారు. ఈ తికమక వ్యాఖ్యలే వీరిద్దరూ వైకాపా నుంచి జంప్ అయ్యేందుకు పాతపట్నం ఎమ్మెల్యే వ్యూహాంతో నియోజకవర్గాల నుంచి కదిలివుంటారన్న పుకార్లు ఊపందుకున్నాయి. దీనికితోడు పాతపట్నం ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ పేర్కొడం వెనుక రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల వ్యూహంగా తెలుగుదేశం పార్టీ నాలుగో అభ్యర్థిని బరిలోకి దించేందుకు సోమవారం విజయవాడలో ఇటీవల వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఇందులో శ్రీకాకుళం నుంచి హాజరైన పాతపట్నం ఎమ్మెల్యే మిగిలిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ నిర్భయంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
దీనిబట్టి రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థి పోటీయే తప్పనిసరైతే, వీరిద్దరినీ రెండుమూడు రోజుల్లో పార్టీ ఫిరాయింపునకు రంగం సిద్ధం చేసేలా బాధ్యతలు పాతపట్నం ఎమ్మెల్యేపై బాబు పెట్టినట్టు తెలిసింది. ఏదిఏమైనప్పటికీ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ సంగతి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ శ్రీకాకుళంకు పాకింది!
ఇదిలా ఉండగా, పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే టిడిపిలో చేరికకు ముందు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు స్క్రీన్‌ప్లేలో ‘హామీ’లకు పార్టీ పెద్దాయనతో భరోసా ఇప్పించినట్టు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ మేరకే వంశధార ప్రాజెక్టు రెండోదశ కదలికలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఆ కదలికలు వెనుక పాతపట్నం ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా మరో కొంతమేర నిధులు ఆ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్ నుంచి పాలకొండ ఎమ్మెల్యే కళావతి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. తాను పార్టీ మారేందుకు సిద్ధంగా లేనంటూ చెప్పుకొచ్చారు. అలాగే, రాజాం ఎమ్మెల్యే జోగులు కూడా తనపై పదేసార్లు ఇటువంటి ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదంటూ వివరణ ఇచ్చారు. మరో 72 గంటలు వేచిచూస్తే అసలు విషయం బయటపడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల వ్యూహంలో ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు చేసే ప్రయత్నాలు వృథాకావని నాటి కిమిడి కళావెంకటరావు రాజ్యసభ ఎన్నిక రుజువు చేసింది. ఓటమి బాటలో ఉన్న కళాను ఉనికి కోసం పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ఖరారు చేసి చివరి క్షణంలో విజయం వైపు నడిపించేందుకు వినియోగించే ఎమ్మెల్యేల ఫార్మూల మళ్లీ ఈ సారి ముఖ్యమంత్రి ప్రయోగించడంలో భాగంగానే వైకాపా ఎమ్మెల్యేలకు ఆహ్వానమని అంటున్నారు.