శ్రీకాకుళం

రాష్ట్భ్రావృద్ధి అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, జూన్ 2: రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చేయడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే బి.అశోక్ అన్నారు. గత యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం వల్ల ఎన్నో కష్టానష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. పట్టణంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. విభజన పరిణామాలను ప్రజలకు వివరించడానికి నవ్యాంధ్ర నిర్మాణానికి వారిని సమాయత్తపరచడానికి సిఎం చంద్రబాబునాయుడు సంకల్పం మేరకు ఆరు రోజులు పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిరావాలన్నారు. సభికులతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఎంపిపి దక్కత ఢిల్లీరావు, ఎఎంసి చైర్మన్ సాహదేవ్‌రెడ్డి, తహశీల్దార్ తారకేశ్వరీ, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు, ఎంపిడివో ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సత్యానారాయణ, ఎంఇవో మురళీకృష్ణ, టిడిపి నాయకులు కె.్ధర్మారావు, సిహెచ్ తులసీదాసు, బి.కృష్ణయ్య, కామేషు, కోటి, ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.