శ్రీకాకుళం

నేటి నుంచి నవ నిర్మాణ సదస్సులు: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 2: నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి వివిధ అంశాలపై సదస్సులను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ సదస్సులు బి.ఆర్.అంబేద్కర్ ఆడిటోరియంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగుతాయని చెప్పారు.
సదస్సుల నిర్వాహణకు అధికారులను నియమంచామని వివరించారు. అశాస్ర్తియంగా రాష్ట్ర విభజన జరగడం వల్ల కలిగే దుష్పప్రభావాలపై శుక్రవారం సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. 4వ తేదీన సమస్యలను అధిగమిస్తూ రెండేళ్ళ కాలంలో సాధించిన ప్రగతిపై సదస్సు జరుగుతుందని, ఐదో తేదీన వ్యవసాయం, అనుబంధం రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్‌లో ప్రణాళికలు అంశాలపైన, ఆరోతేదీన పరిశ్రమలు, సేవారంగం నియంత్రిత వ్యవస్థ సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు, ఏడో తేదీన సంక్షేమ, అభివృదిధ వౌలిక కార్యక్రమాలు ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు అంశాలపై సదస్సు జరుగుతుందని చెప్పారు.
8న మహాసంకల్పం కార్యక్రమంతో నవనిర్మాణ దీక్ష వారం రోజుల కార్యక్రమాలు ముగుస్తాయని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, అంశాల్లో అనుభవజ్జులు, ఆసక్తిగల వ్యక్తులు యువత పాల్గొని అమూల్య సలహాలు, సూచనలు అందించాలని కోరారు.