శ్రీకాకుళం

తుపాకీ నీడలో పాలకొండ మండల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ(టౌన్), జూన్ 2: ప్రజాసమస్యలు ప్రస్తావించేందుకు ఏర్పాటు చేసిన సాధారణ మండల సమావేశానికి 144 సెక్షన్ అమలపై స్థానికులు నివ్వెరపోయారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం తుపాకీ నీడలో మండల సమావేశం ఎంపిపి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కర్నేన అప్పలనాయుడును ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించడం చెల్లదని, కొంతమంది ఎంపిటిసిలు లేవనెత్తారు. ఈ అంశం పట్ల సమావేశంలో ప్రస్తావించాలని వాటపాగు వారాడ సుభాషిణి రెండు రోజుల కిందట ఎంపిడిఒను కోరడంతో ఆ ప్రస్తావనను కూడా ఎజెండాలో చేర్చారు. దీంతో ప్రత్యేక ఆహ్వానితుని నియామకంపై సుమారు రెండు గంటలు వాడీవేడిగా చర్చ జరిగింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రత్యేక ఆహ్వానితుని నియామకంపై మెజార్టీ సభ్యుల ఆమోదం ఉండాలని జెడ్‌పిటిసి దామోదరరావు చర్చలో లేవనెత్తారు. ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్న అప్పలనాయుడు మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం సరికాదన్నారు. ఎంపిపి మాట్లాడుతూ తన తరుపున మాట్లాడేందుకు ప్రత్యేక ఆహ్వానితుని ఎంపిక చేసుకొనే హక్కు తనకుందన్నారు. సర్పంచ్‌లకు ఈ విషయంపై మాట్లాడే హక్కు లేదన్నారు. సభ్యులందరూ ఒకరితో ఒకరు వాదోపవాదాలకు దిగడంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఎంపిడిఒ వి.వి.గోపాలకృష్ణను మాట్లాడాల్సిందిగా ఎంపిపి కోరారు. చట్టప్రకారం మాత్రమే తాను విధులు నిర్వహిస్తానని, ఏ ఒక్కరి అండతో తాను పనిచేయాల్సిన అవసరం లేదన్నారు.
ఎంపిటిసి వినతి తిరస్కరణ
ఎంపిటిసి సభ్యులు సుభాషిణి ప్రత్యేక ఆహ్వానితుని ఎంపికపై ఫిర్యాదు చేసిన అంశాలు వ్యక్తిగతంగా ఉన్నాయని, వీటిని మినిట్ బుక్‌లో చేర్చడం కుదరదని ఎంపిపి తిరస్కరించారు. దీంతో ఎంపిటిసి రాతపూర్వకంగా తనకు రాసి ఇవ్వాలని కోరగా ఎంపిడిఒ సమావేశం ముగిసిన తర్వాత రాసి ఇస్తారని ఎంపిపి వివరణ ఇచ్చారు.
అడుగడుగునా పోలీస్ బందోబస్తు
మండల సమావేశానికి అడుగడుగునా పోలీస్ బందోబస్తు స్థానిక సిఐ వేణుగోపాలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. గేటు దగ్గర నుంచి సమావేశం మందిరం వరకు బందోబస్తు నిర్వహించి పరిషత్ సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులు, విలేఖరులను మాత్రమే అనుమతించారు. ఇరు వర్గాలకు చెందిన అనేక మంది నాయకులు, మద్దతుదారులు ఎంపిడిఒ కార్యాలయానికి వచ్చినప్పటికీ పోలీసులు నిరాకరించారు. సభ నిర్వహణలో గొడవలు జరిగే అవకాశముందని తమకు తెలియడంతో ముందుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిఐ వెల్లడించారు. అయితే మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్న తన దృష్టికి 144 సెక్షన్ తెలియకుండా ఏ విధంగా అమలు చేశారని ఎంపిడిఒను ఎంపిపి ప్రశ్నించారు. ఈ విషయం 159 సెక్షన్‌లోనే స్పష్టంగా పేర్కొని ఉందని ఎంపిడిఒ సమాధానమిచ్చారు.
సమస్యల ప్రస్తావన
సభ్యులు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎజెండాలోని 24వ అంశం గత సమావేశం నుంచి నేటి వరకు ప్రజాపరిషత్ సాధారణ నిధులు ఆగస్టు 2015 నుంచి 2016 మే 23న వరకు రెండు లక్షల 530 రూ.లు కార్యాలయ కంటిజెన్సీ కింద గౌరవ అధ్యక్షులు, మండల ప్రజాపరిషత్ ఆమోదంతో ఖర్చు చేయడంతో ఆమోదం కోరారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గతంలో మంజూరు చేసిన పనులను రద్దుపరుస్తూ ఇతర పనుల మంజూరు కోసం ఆమోదం కోరారు. అలాగే పలు రహదారి పనులపై కూడా ఆమోదం కోరారు. ఈ అంశాలను సమావేశంలో అధిక సంఖ్యలో సభ్యులు తిరస్కరించడంతో ఆమోదం జరగలేదు.