శ్రీకాకుళం

ఈదులవలస ఆదర్శ పాఠశాలలో స్వచ్ఛ్భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, డిసెంబర్ 10: మండలంలో గల ఈదులవలస ఆదర్శ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పి ఈటీ ఉపాధ్యాయుడు మాలుగు నీలం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనట్లు ఆయన తెలిపారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతీ ఒక్క ఇంటికి వెళ్లి పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగం చేయాలని కోరారు. అనంతరం ప్రతీ ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కనైనా నాటాలని వాటివలన కాలుష్యం నివారణ అవతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు, ప్రజలు పాల్గొన్నారు.
రూ.20లక్షలతో సీసి రోడ్డు శంకుస్థాపన
పోలాకి, డిసెంబర్ 10: మండలంలో గల దీర్ఘాసి దుర్గానగర్ కాలనీకి రూ.20 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శంకుస్థాపన చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటితో పాటు అంపలాం పంచాయతీ రాజారాం పురం గ్రామానికి రూ.20లక్షల సిసి రోడ్లు ప్రారంభించారు. అలాగే కుసుమపోలవలసలో రూ.7.5 లక్షలతోనిర్మాణమైన అంగన్వాడీ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతీ ఒక్క పంచాయతీలో గల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్‌లుకు, ఎంపీటీసీ సభ్యులకు గ్రామకమిటీ అధ్యక్షులతో మాట్లాడుతూ మీమీ గ్రామాలకు ఏయే పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అని పార్టీలకతీతంగా పథకాల్లో అర్హుడైతే చాలు ప్రతీ ఒక్కరికి అందించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గొండు రామన్న, మండల ప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కిల్లి వేణుగోపాలస్వామి, ఏ ఎంసీ చైర్మన్ బైరి భాస్కరరావు, వంశధార ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు వెంకటప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు పల్లి సూరిబాబు, చిట్టి సింహాచలం, ఎంపీటీసీ సభ్యులు మెండ శ్రీనివాసరావు, కొమర పద్మతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

గర్భిణులకు వైద్య పరీక్షలు
* వైద్యాధికారి విక్రమ్‌దేవ్
జలుమూరు, డిసెంబర్ 10: గ్రామీణ ప్రాంతాలలో గర్భిణులకు మరింత పటిష్టమైన ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రతీనెల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి విక్రమ్‌దేవ్ తెలిపారు. జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 16 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. మంచి పోషక ఆహార పదార్ధాలు, ఇతర జాగ్రత్తలు గర్భిణి తీసుకోవల్సిన ముఖ్య విషయాలను వైద్యాధికారి విక్రమ్‌దేవ్ వారికి సూచించారు. ఆయనతో పాటు హెల్త్ పర్యవేక్షకులు చినరాజులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

అగ్ని బాధితులను ఆదుకుంటాం
* ఎమ్మెల్యే రమణమూర్తి
జలుమూరు, డిసెంబర్ 10: మండలం మాకివలస గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బుద్దల చిన్నయ్య, గొంతుకుర్తిరాజులమ్మకు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన స్వంత నిధులతో బట్టలు, వంటపాత్రలును బాధితులకు అందజేశారు. ప్రభుత్వ పరంగా ప్రతీ కుటుంబానికి పదికిలోల బియ్యం, 5వేలు నగదు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుండి ఇళ్లు మంజూరు చేస్తామని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తహశీల్దార్ కె.ప్రవళ్లిక ప్రియ, మాజీ మండలాధ్యక్షులు వెలమల క్రిష్ణారావు, మండల జన్మభూమి కన్వీనర్ బగ్గు గోవిందరావు, స్థానిక రెవెన్యూ అధికారి చొంగలి రామారావుపలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.