శ్రీకాకుళం

చిన్నారి చూపులో విద్యార్థులందరికి నేత్ర పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 12: చిన్నారి చూపు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అందరికి నేత్ర వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నారు. కేంద్రీయ విద్యాలయ యాజమాన్యం కమిటీ బుధవారం కలెక్టర్ అధ్యక్షతన కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. అన్ని పాఠశాలల విద్యార్థులకు చిన్నారి చూపు కార్యక్రమంలో నేత్ర వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించాలని సూచించారు. నేత్ర సమస్యలుంటే అవసరానికి అనుగుణంగా కళ్లద్దాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు అన్ని అంశాలపట్ల సమగ్రమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. ప్రేరణ అత్యవసరమని పేర్కొంటూ వచ్చే రెండు, మూడు నెలల్లో పరీక్షలకు విద్యార్థులు హాజరు కానున్నారని, వారికి విద్యా మానసిక కౌన్సిలర్లతో ప్రేరణ, అవగాహన తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మ విశ్వాసం పెరగాలని, పరీక్షలను ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా రాయగలగాలని అన్నారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో రంగంలో అభిరుచి ఉంటుందని, అందుకు అనుగుణంగా ఆయా రంగంలో చేరే విధంగా ఆసక్తి కల్గించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు సమాజ సేవ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు గల విద్యార్థులను ఇందులో ఎక్కువగా భాగస్వామ్యం చేయాలని సూచిస్తూ సమాజంలో రుగ్మతలైన నిరక్షరాస్యత, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల విసర్జన, బాల్య వివాహాలు, పర్యావరణ పరిరక్షణ, రహదారి భద్రత, హెల్మిట్ ధరించి వాహనాలు నడపడం వంటి కార్యక్రమాలపై గ్రామాలకు పంపించాలన్నారు. చిన్నారులు గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలలో పాల్గొనడం వలన ప్రజలు సైతం ఆసక్తి చూపుతారని, చిన్నారులకు యధార్థ పరిస్థితి తెలుస్తొందని, తద్వారా భవిష్యత్‌లో కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. పాఠశాల చిల్డ్రన్ పార్క్ పునరుద్ధరణకు తగిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. తల్లి దండ్రులు, పెద్దలను గౌరవించే విధానం, మంచి ప్రవర్తన, తదితర అంశాలలో విద్యార్థులకు కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా పిల్లలు, తల్లి దండ్రులు మద్య మంచి ప్రేమానుభావాలు ఉంటాయని, కుటుంబంలో చక్కటి ఆరోగ్యకర వాతావరణం వస్తుందని సూచించారు. విద్యాలయంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్‌కు తగిన సూచనలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కె.శంకరయ్య, డి ఐవో డాక్టర్ బి.జగన్నాధరావు, డిపి ఆర్వో ఎల్.రమేష్, డిగ్రీ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ బి.పోలీస్, ఇతర సభ్యులు పుష్పలత, దివాకర్, కె.చంద్రశేఖరరావు, నర్శింహులు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్లు రుణాలు సకాలంలో అందించాలి
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 12: ఇళ్లు రుణాలను సకాలంలో అందించాలని ఎంపీపీ ఢిల్లీరావు హౌసింగ్ ఎ ఇ రాజగోపాల్‌కు తెలియజేసారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్‌శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మండలంలో 652 ఇళ్లు బిల్లులు బకాయిలు ఉన్నాయని, వాటిని సకాలంలో చెల్లించాలన్నారు. ఇప్పటికే మండలంలో ఉన్న 21 పంచాయతీలు నుంచి రుణాలు అందడం లేదని తెలియజేసారని పేర్కొన్నారు. రుణాలు సక్రమంగా చెల్లించకపోతే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక హౌసింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రబీపంట నమోదు చేసుకోవాలి
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 12: మండలంలో రైతులు వేస్తున్న రబీపంటను నమోదు చేసుకోవాలని రెవెన్యూ పరిశీలకులు ఎం.కృష్ణమూర్తి తెలియజేసారు. బుధవారం మండలంలో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా రబీ పంటగా ఉలవలు, నువ్వులు, చోడీ సాధారణంగా వేస్తారని, ఇప్పటి వరకు వేసిన రైతులు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకుంటే ప్రకృతివైపరీత్యాల సమయంలో బీమా వస్తుందన్నారు. అనంతరం తహసీల్థార్ కార్యాలయంలో సమావేశమైనారు. ఈ కార్యక్రమంలో ఏవో నర్శింహమూర్తి, ఎంపీ ఇవోలు పాల్గొన్నారు.

తిత్లీ బాధితులకు రేకుల పంపిణీ
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 12: కవిటి మండలం, కవిటిబెహారావీధిలో తిత్లీ తుపాన్ బాధితులకు మాజీ ఎంపీపీ బెందాళం ప్రకాశ్ ఆధ్వర్యంలో రేకులను పంపిణీ చేసారు. బుధవారం కవిటిబెహారావీధిలో టీడీపీ నాయకులు పర్యటించి ఇళ్లు నష్టపోయిన జాబితాను పరిశీలించారు. అర్హులైన వారికి రేకులను అందించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాండవ శేఖర్, ఎస్.వెంకటరమణ, మధు, దిలీప్, దీపక్, రంగా పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించండి
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 12: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించాలని కవిటి మండల ఏపిటి ఎఫ్ అధ్యక్షుడు రంగారావు పేర్కొన్నారు. బుధవారం కవిటి ఏపిటి ఎఫ్ సభ్యులు వివిధ పాఠశాలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. సభ్యత్వనమోదును చేపట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న భాషాపండితులను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. గోపి, లక్ష్మణమూర్తి, జగన్ పాల్గొన్నారు.

పోర్టు సర్వేకు మర్రిపాడులో భూమిపూజ
సంతబొమ్మాళి, డిసెంబర్ 12: మండలంలోని భావనపాడుపోర్టు నిర్మాణంలో భాగంగా భూముల పరిశీలనకు బుధవారం మర్రిపాడులో భూమి పూజ చేసారు. మర్రిపాడు గ్రామస్తులు తమ పంట పొలాలను ఇచ్చేందుకు మంగళవారం సుముఖత వ్యక్తం చేయడంతో బుధవారం భూముల సర్వేను ప్రారంభించారు. ఆర్ ఐలు కృష్ణారావు, వౌళిల ఆధ్వర్యంలో సర్వేను ప్రారంభించారు. వి ఆర్‌వోలు,రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయం సాగులో మెళుకవులు పాటించండి
సంతబొమ్మాళి, డిసెంబర్ 12: వ్యవసాయంసాగులో మెళుకవులు పాటించాలని ఆత్మ డిటి ఎన్ నిర్మల, పావనిలు అన్నారు. సంతబొమ్మాళి పంచాయతీ, లక్ష్మిపురం గ్రామంలో సూక్ష్మపోషకాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. వరిసాగులో అధిక దిగుబడులు సాధించాలంటే పంట పొలాల్లో తప్పనిసరిగా సూక్ష్మపోషకాలు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జింక్, జిప్సమ్‌లు వాడాలన్నారు. మధు, రఘువర్మ, ఎంపి ఇవో బాలకృష్ణ పాల్గొన్నారు.
టీడీపీతోనే అభివృద్ధి
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 12: టీడీపీతోనే మారుమూల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని గోవిందపురం పిహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పి. ఈశ్వరరావు అన్నారు. బుధవారం ఉద్దానగోపినాధపురంలో 7 లక్షల 50 వేల రూపాయలు నిధులతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో అభివృద్ధి ఫలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రోడ్డునిర్మాణాలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శివాజీతోపాటు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీషా, నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్నచౌదరిలు కృషి మేరకు పథకాలు మంజూరవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంతస్వామి, మండల విప్ ఢిల్లేశ్వరీరమణ, టీడీపీ ఉపాధ్యక్షుడు ఎం.జోగారావు పాల్గొన్నారు.
డీలర్లు సమస్యలు పరిష్కారించాలి
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 12: ఎన్నో ఏళ్లు నుంచి అపరిష్క్రతంగా ఉన్న రేషన్‌డీలర్లు సమస్యలను పరిష్కారించాలని కోరుతూ బుధవారం డీటీ అప్పలస్వామికి తహసీల్థార్ కార్యాలయంలో డీలర్లు సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ నెల 15వ తేది నుంచి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరవధిక సమ్మెకు డీలర్లు మూకుమ్మడిగా దిగుతున్నట్లు తెలిపారు. డీలర్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు సంఘం అధ్యక్షుడు తవిటయ్య, కామేశ్వరరావు, జోగారావు, అప్పారావు, మోహనరావు, రామ్మూర్తి, పి.గోపాల్ పాల్గొన్నారు.

టీడీపీది అభివృద్ధిమంత్రం
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 12:టీడీపీది అభివృద్ధి మంత్రమని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు వద్దకు వచ్చే ఎన్నికలలో వెళ్తుందని, తెలంగాణాలో టీ ఆర్ ఎస్ పార్టీ మాదిరిగా ఇక్కడ విజయం సాధిస్తుందని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దున్న కృష్ణారావు అన్నారు. బుధవారం పూండిలో విలేఖరులతో మాట్లాడారు. ప్రజాసంక్షేమానికి చిత్తశుద్దితో పనిచేసేది టీడీపీ మాత్రమేనన్నారు. ఎమ్మెల్యే శివాజీ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీషా, నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్నచౌదరి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, గౌతుకుటుంబానికి విమర్శించేస్థాయి వైసీపీ నాయకులకు లేదన్నారు.

ఓటర్లు జాబితాపై పక్కాగా సర్వే నిర్వహించాలి
టెక్కలి, డిసెంబర్ 12: ఓటర్లు జాబితా ప్రక్రియపై పక్కాగా సర్వే నిర్వహించాలని ఆర్డీవో, నియోజకవర్గ ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మండలస్థాయి అఖిల పక్ష రాజకీయపార్టీ నాయకులు, బీ ఎల్‌వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు జాబితాలో వున్న తపోప్పులను సరిచేయడానికి దృష్టి సారించాలన్నారు. ఫారమ్-6,7,8 ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ చేయాలన్నారు. చనిపోయినవారి పేర్లు ఓటర్లు జాబితాలో లేకుండా చూడాలన్నారు. బదిలీపై వెళ్తున్న ఓటర్లుపై దృష్టి సారించాలన్నారు. అన్ని రాజకీయపార్టీలు కూడ ఈ విషయంలో సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీ ఎం, సీపీ ఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, సత్యం, కె.మణిబాబు, షణ్ముఖరావు, కృష్ణంరాజు, తహసీల్థార్ కార్యాలయం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

బాధితులకు దుస్తులు పంపిణీ
టెక్కలి, డిసెంబర్ 12: తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవాలనే ధ్యేయంతో శ్రీకాకుళంకు చెందిన జానకిరామయ్యచారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని సీతారామపల్లి గ్రామంలో దుప్పట్లు పంపిణీ చేసారు. బాధితులకు ట్రస్టు చైర్మన్ మాధవరావు చేతులు మీదుగా దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసారు. గురునాద్‌యాదవ్, చిన్నయ్య పాల్గొన్నారు.
ఇంటింటికి బీజేపీ
టెక్కలి, డిసెంబర్ 12: మండలంలో పెద్దసాన,పరశురాంపురం గ్రామాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని బీజేపీ టెక్కలి నియోజకవర్గకన్వీనర్, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు హనుమంతు ఉదయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మోడీ పరిపాలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, అడవిరాజు, నివాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌గా రామలక్ష్మి
ఇచ్ఛాపురం, డిసెంబర్ 12 : ఇచ్ఛాపురం నూతన మున్సిపల్ కమిషనర్‌గా ఎల్.రామలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా వ్యవహరించిన జె.రామప్పలనాయుడు ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన రామప్పలనాయుడును ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
ఘనంగా అయ్యప్పస్వాముల కనె్నపూజ
ఇచ్ఛాపురం, డిసెంబర్ 12 : పట్టణంలోని స్వేచ్ఛావతి అయ్యప్ప ఆరాధన పీఠంలో దుర్గా గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం 108 స్వాములతో ఘనంగా కనె్నపూజ నిర్వహించారు. తొలుత స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దాదాపు ఐదు గంటల సేపు కనె్నపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది.
విద్యార్థులకు ఉచితంగా నవోదయ కోచింగ్
సోంపేట, డిసెంబర్ 12: మండలంలోని గొల్లవూరు గ్రామంలో ఆ గ్రామసమైక్యసేవా సంఘం ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నవోదయ పరీక్షలు కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు సంఘం అధ్యక్షులు లోకనాధం తెలిపారు. గ్రామంలో వున్న పేద విద్యార్థులకు జవహార్ నవోదయ పరీక్షలు మంచి అవకాశమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పలువురు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో యాదవరావు, ఉపేంద్ర, విశ్వనాధం, పి.యోగి, మధు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.